Bendakaya Masala Recipe
బెండకాయ మసాల రెసిపి
కావలసిన పదార్థాలు:
పావుకిలో బెండకాయలు.
రెండు ఉల్లిపాయలు
కావాల్సినంత చింతపండు
టీ స్పూన్ కారం
పసుపు
కరివేపాకు సరిపడా
ఉప్పు ఆవాలు,జీలక్రర టీ స్పూన్
మెంతులు చిటికెడు
ఉద్ది పప్పు కొద్దిగా
టీ స్పూన్ ధనియాలు
సరిపడా నునె
తయారు చేయు విధానం:
బెండకాయలను నీటిలో కడిగి ఆరబెట్టుకోవాలి.
బెండకాయలను ,ఉల్లిపాయలను కట్ చేసి పెట్టుకోవాలి.
చింత పండును అందులో నానబెట్టుకోవాలి.
స్టౌ మీదు పాన్ పెట్టి అందులో నూనె వేసి వేడి అయ్యాక అందులో మసాలా దినుసులను వేయించుకొని చల్లారనివ్వాలి.
తర్వాత మిక్సీలో వేసి మెత్తగా పౌడర్ చేసుకోవాలి.
కొద్దిగా ఉల్లిపాయలు వేసి, కొంచెం ఉప్పు వేసి మెత్తని పేస్ట్ లా చేసుకోవాలి. పాన్ లో నూనె వేసి వేడయ్యాక అందులో పోపు దినుసుల వేయించుకోవాలి.
బెండకాయ ముక్కలను కూడా వేసి తక్కువ మంటలో పది నిమిషాలు వేయించుకోవాలి.
తర్వాత అందులో మసాలా ముద్ద, కరివేపాకు వేసి వేయించాలి.
తర్వాత చింత పండు గుజ్జును కూడా అందులో వేసి కొద్దిగా నీళ్ళు పోసి మూత పెట్టి ఉడికించుకోవాలి.
కొంచం ఆగి అందులో కారం, పసుపు, ఉప్పు వేసి ఐదు నిమిషాలు బెండకాయ ఉడికనిచ్చి స్టౌ మీద నుండి దించేసుకోవాలి.
చపాతీ కానీ అన్నం తో కానీ చాలా బావుంటుంది