బీట్ రూట్ చీలా

 

 

బీట్ రూట్ చీలా

 

కావాల్సిన పదార్థాలు:

బీట్ రూట్ - 1

శనగపిండి-1/2 కప్పు

కారం -1 స్పూన్

నల్లమిరియాలు-1స్పూన్

ఉప్పు రుచికి సరిపడా

తయారు చేసే విధానం:

-బీట్‌రూట్ చీలా చేయడానికి, ముందుగా ఒక బీట్‌రూట్ తీసుకుని, దానిని కట్ చేసి దాని ప్యూరీని తయారు చేయండి.

-ఇప్పుడు ఒక గిన్నెలో శెనగపిండి, బీట్‌రూట్ ప్యూరీ, ఉప్పు, మిరియాలు, కారం వేసి కలపాలి.

-పిండి కొంచెం పులియడానికి కొద్దిగా ఫ్రూట్ సాల్ట్ కలపండి.

-ఇప్పుడు స్టౌ మీద పెనం పెట్టి అది వేడి అయ్యాక గరిటెతో పరిచి ఉడికించాలి.

-అంతే సింపుల్ బీట్ రూట్ చిల్లా రెసిపి రెడీ. -వేడి వేడి బీట్ రూట్ చిల్లా ఏదైనా చట్నీతో తింటే రుచి అదిరిపోతుంది.

 

 

Recommended for you