banana kabob
అరటికాయ కబాబ్
కావలసిన పదార్థాలు
* అరటికాయలు-మూడు,
* ఉల్లిపాయ-ఒకటి
* కొత్తిమీర-కొద్దిగా
* నూనె-కొద్దిగా
* జీలకర్ర, ధనియాలపొడి-అరచెంచా
* గరంమసాలా-చెంచా
* మొక్కజొన్న పిండి-రెండు చెంచాలు
* నిమ్మరసం -చెంచా,
* పచ్చిమిర్చి-మూడు,
* అల్లం-చిన్నముక్క
* ఉప్పు, కారం-తగినంత,
* పసుపు-చిటికెడు,
తయారుచేసే పద్దతి
ముందుగా మనం అరటికాయలను బాగా ఉడికించుకోవాలి. అవి ఉడుకుతుండగా పచ్చిమిర్చిని
ఉల్లిపాయలను తరిగి పెట్టుకోవాలి. ఉడికిన అరటికాయలను చల్లార్చుకొని పొట్టుతీసి మెత్తగా
మెదపాలి. స్టౌ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని ఆ గిన్నెలో తగినంత పోసుకోవాలి. ఆ నూనె వేడయ్యాక
అరటి ముద్ద ఆ నూనెలో వేయాలి. నిమ్మరసం తప్ప మిగిలిన పదార్థాలు కూడా వేసేసి
కలియతిప్పాలి. చివరికి నిమ్మరసం చల్లి స్టౌ ఆపేయాలి. మనం తయారు చేసుకున్నది చల్లారిన
తరువాత ఒక గిన్నెలో నచ్చిన ఆకృతిలో చేసుకుని వేయించుకొంటే కబాబ్‌లు తయారు అయినట్టే !