Atlatadde Atlu (AtlaTaddi Special)

 

 

 

 

అట్లతద్ది అట్లు (అట్లతద్ది స్పెషల్)

 

 

కావలసిన పదార్థాలు:

బియ్యప్పిండి - 3 గ్లాసులు
మెంతులు - అర చెంచా
మినపప్పు - 1 గ్లాసు
ఉప్పు - అర చెంచా

తయారు చేయు విధానం:

మినపప్పు 3 గంటలపాటు నానబెట్టాలి. మినపప్పుతో పాటు మెంతులు కూడా నానబెట్టాలి. తరువాత కడిగి మెత్తగా రుబ్బుకోవాలి. బియ్యం కూడా 8గం: నానబెట్టి కడిగి వాడేసి ఆరాక మిక్సీలో పొడి చేసుకుని ఆ పిండిని జల్లించి మెత్తని పిండి, మినప్పిండితో ఉప్పువేసి కలుపుకుని.. అట్లు వేసుకోవాలి. తడిపిండికి బదులు పొడి పిండిని కూడా ఒక గంటముందు కలుపుకుని.. నానిన తరువాత అట్లు వేసుకోవాలి. ఈ దోశలు తెల్లగా, మెత్తగా చాలా రుచిగా వస్తాయి. వీటిని నేయి, బెల్లం, ముద్దపప్పుపైన వేసి వాయిన మిస్తారు. టిఫిన్లలో తినాలి అనుకుంటే చింతకాయ పచ్చడి కాంబినేషన్‌లో చాలా బావుంటాయి

- భారతి