Aloo Snacks Recipe

 

ఆలూ స్నాక్స్ రెసిపి

కావలసిన పదార్థాలు:
 బంగాళాదుంపలు: అర కేజీ
గోధుమ పిండి : 2 cups
అల్లం: చిన్న ముక్క
ఉప్పు: సరిపడా
నెయ్యి : 4
ఉల్లిపాయలు : 2
పచ్చిమిర్చి : 8

తయారి:
ముందుగా బంగాళాదుంపలు ఉడికించి, పొట్టుతీసి మెత్తగా చేసి పక్కన  పెట్టుకోవాలి.
గోధుమ పిండి  నీళ్ళు, ఉప్పు వేసి, చపాతీ పిండిలా కలుపుకోవాలి.

ఇప్పుడు  పచ్చిమిర్చి, అల్లం, ఉల్లిపాయ, పేస్ట్  చేసి పెట్టుకోవాలి.
తరువాత బంగాళాదుంపల ముద్ద,మిర్చిపేస్ట్  ఉప్పు కలిపి పెట్టుకున్న పిండిలో  వేసి బాగా కలపాలి.

తరువాత  స్టవ్ వెలిగించుకుని నాన్ స్టిక్ పాన్ పెట్టుకుని పిండిని రౌండ్ గా చిన్నఉండలుగా చేసి వాటిని ఒత్తినెయ్యి వేసి బ్రౌన్ కలర్  వచ్చేవరకు కాల్చుకోవాలి.