Janthikalu (Mothers Day Special Recipes)
జంతికలు (Mothers Day Special Recipes)
పిండివంటలంటే గుర్తొచ్చేది అమ్మ చేసే జంతికలు.. ఇంట్లో అమ్మ చేతితో చేసి పెట్టే ఈ పిండివంటల రుచే వేరబ్బా... బయట షాప్ లో ఎంత డబ్బు పెట్టి పిండి వంటకాలు కొనుక్కుని తిన్నా ఆ రుచి మాత్రం రాదు కదా. అలాంటి సాంప్రదాయ పిండివంటలు మరోసారి గుర్తుతెచ్చుకుందామా...
కావాల్సిన పదార్థాలు:
మినప పప్పు - 1 గ్లాసు
బియ్యం - 3 గ్లాసులు
నువ్వులు - 1/2 కప్పు
తయారి విధానం:
మినపప్పు, బియ్యం రెండిటిని కలిపి పిండి ఆడించాలి. ఒక బేసిన్లో పిండి వేసి అందులో ఉప్పు కారం నువ్వులు వేసి నీళ్ళు పోస్తూ కలుపుకోవాలి. పిండి పలచన అవ్వకుండా చేతితో ఉండ చేసే విధంగా ఉండాలి. ఆ మిశ్రమాన్ని జంతికల గొట్టంలో పెట్టి వేడి వేడి నూనెలో పిండుకుని వేగాకా తీసేయ్యటమే. కావాలనుకుంటే ఇందులో వాము వేసుకోవచ్చు. కొంతమంది అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటారు.