RELATED EVENTS
EVENTS
స్కాట్లాండ్ లో మొట్టమొదటిగా జరుగబోవు అష్టావధానము...

స్కాట్లాండ్ లో మొట్టమొదటిగా జరుగబోవు అష్టావధానము

 

 

ప్రపంచములోనే అత్యంత సుందరమైన దేశాలలో స్కాట్లాండ్ ఒకటి. బ్రిటన్ లో ఉన్నవారికి మాత్రమే కాకుండా ఐరోపా మరియు ఇతర దేశాల వారికి అదొక యాత్రాస్థలం.

స్కాట్లాండ్ లో జులై 9 న మొట్టమొదటిసారి ఒక గొప్ప అష్టావధానమును తలపెట్టి, ఆ కార్యక్రమములో తెలుగు ఔత్సాహికులు (ప్రసాద్ మంగళంపల్లి, రంజిత్ నాగుబండి, శైలజ గంటి, సాయికుమారి దొడ్డ, హిమబిందు జయంతి, విజయ్ కుమార్ రాజు పర్రి, మిథిలేష్ వడ్డిపర్తి, పండరి జైన్ పొలిశెట్టి, మమత వుసికల, అనంత రామానంద్ గార్లపాటి, సత్య శ్యాం జయంతి, నిరంజన్ నూక) ఇలా 12 మంది పృచ్ఛకులుగా పాల్గొనబోతున్నారు. అవధానిగా త్రిభాషా మహాసహస్రావధాని, శ్రీ ప్రణవ పీఠాధిపతి బ్రహ్మశ్రీ “వడ్డిపర్తి పద్మాకర్” గారు వ్యవహరించబోతున్నారు. ప్రార్థనా గేయాన్ని స్కాట్లాండ్ లో గాయకుడుగా ప్రఖ్యాతి చెందినటువంటి బాలుడు అనీష్ కందాడ ఆలపించబోతున్నాదు.

ఈ కార్యక్రమ నిర్వాహకులైన శ్రీ విజయ్ కుమార్ రాజు గారు అందరినీ రాజధాని ఎడింబర్ఘ్ కు ఆహ్వానిస్తున్నారు. అవధాని మరియు పృచ్ఛకుల మధ్యన జరుగబోతున్న ఈ ఆసక్తికరమైన, రసవత్తరమైన సాహితీ ప్రక్రియను జరుపుటకు ఎడింబర్ఘ్ హిందూ మందిర్ నందు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

అంతే కాకుండా రోజంతా మరెన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు (ప్రవచనాలు, ధర్మ సందేహాలు, భోజన ప్రసాదం, పాదపూజలు) నిర్వహించబడుతున్నాయి. మరిన్ని విశేషాలకొరకు ఆహ్వాన పత్రికను చూడగలరు. ప్రత్యక్ష ప్రసారాన్ని అనేక వెబ్ సైట్ల ద్వారా చేయడానికి సన్నాహాకాలు జరుగుతున్నట్లు కార్యనిర్వాహకులు చెబుతున్నారు.

కావున అందరు ఈ కార్యక్రమానికి విచ్చేసి ఆధ్యాత్మికత యందు మునిగి తేలాలని ఆశిద్దాం.

TeluguOne For Your Business
About TeluguOne
;