RELATED EVENTS
EVENTS
న్యూజెర్సీ సాయి దత్త పీఠంలో ఘనంగా గురుపౌర్ణమి ఉత్సవాలు



న్యూజెర్సీ సాయి దత్త పీఠంలో ఘనంగా గురుపౌర్ణమి ఉత్సవాలు

అమెరికాలో ఆధ్యాత్మిక ప్రవాహాన్ని కొనసాగిస్తున్న న్యూజెర్సీ సాయి దత్త పీఠం గురుపౌర్ణమి ఉత్సవాలను ఘనంగా నిర్వహించింది. గురు దేవో భవ అంటూ ఆ గురువు యొక్క ప్రాముఖ్యతను.. వివరిస్తూనే భక్తి పరిమళాలు పంచింది. శ్రీశ్రీ శ్రీ పరిపూర్ణ నంద స్వామిజీ చేతుల మీదగా ఈ గురుపౌర్ణమి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. గురువు ప్రాథాన్యత ఏమిటి..? గురు భక్తి ఎలా ఉండాలనేది పరిపూర్ణ నంద స్వామి  భక్తులకు వివరించారు. ఓ గురువుగా బాబా ఈ సమాజాన్ని మంచి తనం వైపు.. ఆధ్యాత్మికత వైపు నడిపించారని... అదే బాటలో నడిస్తే సమాజంలో శాంతి పరిఢవిల్లుతుతందని పరిపూర్ణ నంద స్వామి స్పష్టం చేశారు.

 

5 రోజుల పాటు  గురుపౌర్ణమి ఉత్సవాలు ఎంతో కన్నులపండువగా జరిగాయి. ఒక్కో రోజు ఒక్కో ప్రత్యేకతగా ఉత్సవాలు సాగాయి. సాయి దత్త పీఠం నిర్వహకులు రఘు శంకరమంచి ఈ ఉత్సవాలను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించారు. అందరి దేవుళ్లను పూజిస్తూ... ఆ దేవుళ్లు సన్మార్గాలను ఈ  ఉత్సవాల్లో భక్తులకు వివరించడం జరిగింది. సాయిబాబాకు ఈ సందర్భంగా లక్ష పువ్వులతో పుష్పార్చన కార్యక్రమానికి భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేశారు. అమెరికాలో ఇలా బాబాను అర్చించడం చూసి భక్తుల మనస్సు భక్తి పారవశ్యంలో మునిగిపోయింది. బాబాను స్మరిస్తూ 24 గంటలు ఆపకుండా నిరంతర సాయి సత్చరిత్ర పారాయణం చేయడం జరిగింది. దీంతో పాటు హనుమాన్ చాలీసా కూడా భక్తులు పారాయణం చేశారు. సత్యనారాయణ వ్రతం కూడా ఉత్సవాల్లో భాగంగా నిర్వహించడంతో భక్తులు చాలా మంది ఈ వ్రతానికి హజరయ్యారు.

 

సాయి దత్త పీఠం కొనసాగించే నిత్యాన్నదానం కార్యక్రమానికి కూడా ఈ ఉత్సవాల్లో విశేష స్పందన లభించింది. ముఖ్యంగా గురుపౌర్ణమి నాడు ఉదయం ఎనిమిది నుంచి రాత్రి పదిన్నర గంటల వరకు భక్తులు నిత్యాన్నదానంలో ప్రసాదాలు స్వీకరించారు. సాయి దత్తపీఠం ఉత్సవాల సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేసింది. నృత్య మాధవి పాఠశాల, శ్రీమతి దివ్య ఏలూరి శిష్య బృందం చేసిన  కూచిపూడి నృత్యాలు, శ్రీకృష్ణ  పారిజాతమ్ బ్యాల భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. మొత్తంగా 4 వేల మంది మించి భక్తులు హాజరయ్యారు. గురుపౌర్ణమి ఉత్సవాలను ఘనంగా నిర్వహించడంలో తమ వంతు సాయమందించిన ప్రతి ఒక్కరికి రఘు శంకరమంచి ప్రత్యేక అభినందనలు తెలిపారు. సాయి చూపిన భక్తి మార్గాన్ని అమెరికాలో మరింత విసృత్తపరించేందుకు సాయి దత్త పీఠం బృందం మరింతగా కృషి చేస్తుందని ఆయన తెలిపారు.

TeluguOne For Your Business
About TeluguOne
;