RELATED EVENTS
EVENTS
సెయింట్ లూయిస్ లో ఘనంగా దీపావళి వేడుకలు

సెయింట్ లూయిస్ తెలుగు సంఘం ప్రవాసాంధ్రులు దీపావళి వేడుకలు అక్టోబర్ 25, 2014 న కన్నుల పండువగా జరుపుకున్నారు. వెయ్యి మందికి పైగా పాల్గొన్న ఈ వేడుకల లో, తెలుగు సాంప్రదాయానికి అనుగుణంగా ఎంతో అందంగా అలంకరించిన వేదికపై సెయింట్ లూయిస్ తెలుగు సంఘం సభ్యులు ప్రదర్శించిన సాంసృతిక కార్యక్రమాలు చూడడానికి రెండు కళ్ళు చాలవనిపించింది.

 

చిన్నారులు ప్రదర్శించిన దశావతారం శాస్త్రీయ నృత్య ప్రదర్శన ఆహుతులను ఎంతగానో అలరించింది. ప్రత్యేక అతిధులు గా విచ్చేసిన ప్రముఖ సినీ గాయకులు కారుణ్య, హిమబిందు లు తమ గానం తో ప్రేక్షకులను ఉర్రూతలూగించగా మిమిక్రీ కళాకారులు అభినయకృష్ణ తన ప్రదర్శన తో ఆకట్టుకున్నారు.



సాంస్కృతిక కార్యదర్శి శ్రీకాంత్ సరస్వతుల కార్యక్రమాలను పర్యవేక్షించారు. అధ్యక్షులు డా. రామమోహన్ రెడ్డి పాదూరు ఈ వేడుకలతో పాటుగా గత రెండు సంవత్సరాలుగా సహాయ సహకారాలను అందించిన తన కార్యవర్గం నకు , సభ్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. సంఘం ఉపాధ్యక్షులు డా. రామకృష్ణ గొంది, కార్యదర్శి కిషోర్ జంగా ఈ వేడుకలను విజయవంతంగా నిర్వహించడానికి ప్రధాన పాత్ర పోషించారు. కోశాదికారి మురళీకృష్ణ పుట్టగుంట సభ్యత్వ నమోదు పర్యవేక్షించారు.



సెయింట్ లూయిస్ తెలుగు సంఘం నూతన కార్యవర్గం ఎంపికకు జరిగిన ప్రతిష్టాత్మకమైన ఎన్నికల లో మురళీకృష్ణ పుట్టగుంట అధ్యక్షుని గా, రవీంద్రనాథ్ కర్నాటి ఉపాధ్యక్షుడి గా, రవిరాజ్ కొలకలేటి కార్యదర్శి గా, లహరి దాస్యం సాంస్కృతిక కార్యదర్శి గా మరియు కళ్యాణ్ వుయ్యూరు కోశాధికారి గా ఎన్నిక అయ్యారు. జితేందర్ ఆలూరి, శ్రీకాంత్ సరస్వతుల బోర్డు అఫ్ డైరెక్టర్స్ గా ఎన్నిక అయ్యారు.

TeluguOne For Your Business
About TeluguOne
;