RELATED EVENTS
EVENTS
Bakersfield Telugu Association (BakTA) Celebrated Sankranthi

దక్షిణ కాలిఫొర్నియా లోని బేకర్స్ ఫీల్డ్ తెలుగు సంఘం (బక్త) తెలుగు సాంప్రదాయానికి అనుగుణంగా ఘనంగా సంక్రాంతి సంబరాలను స్థానిక చిన్మయ మిషన్ లో జరుపుకుంది.

 

వందకు పైగా పిల్లలు, పెద్దలు పాల్గొన్న ఈవేడుకలో అచ్చతెలుగు పిండివంటలతో చేసిన సాంప్రదాయ విందు భోజనం, ఆంధ్ర ప్రదేశ్ లోని ప్రముఖుల సందేశాలు, సాంస్కృతిక కార్యక్రమాలు చోటుచేసుకున్నాయి.

Bakersfield Telugu Association, bakta celebrated Sankranthi, bakta sankranti celebations, sankranti celebrations bakta

 

కార్యక్రమం రాష్ట్రంలోని ప్రముఖుల ఆడియో సందేశాలతో ప్రారంభమయ్యింది. రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు గవర్నర్ గౌరవనీయులు రోశయ్య, ప్రజా గాయకుడు గద్దర్, చిత్ర ప్రముఖులు, చిత్రకారులు, కార్టూనిస్టులు, రచయితలైన బాపు, గొల్లపూడి మారుతీరావు, జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు, బాలి, ప్రొఫెసర్ జయదేవ్, రామజోగయ్య శాస్త్రి, యండమూరి వీరేంద్రనాధ్, మరియు వసుంధరల ప్రత్యేక సందేశాలను స్లైడ్ షోలో చూపించి వినిపించారు. ఆపై దారా సురేంద్ర వ్రాయగా బెల్లం నాగేంద్ర, గోగులపాటి మధు, శ్రీలక్ష్మి దంపతులు నాగసూరి కృష్ణ, సునీత లు దంపతులు ప్రదర్శించిన “తర్జుమాలో తికమకలు” అన్న హాస్యనాటిక అందరినీ రంజింపచేసింది. తరువాత ముత్యాల రామసుబ్బారావు, కొమ్మినేని శ్రీధర్, మరియు వేమూరి సురేష్ లు ప్రదర్శించిన “వైద్యుడు-రోగి” అన్న హాస్య కార్యక్రమం అందరినీ కడుపుబ్బ నవ్వించింది. అలాగే బెల్లం హరిప్రియ, కాసుల గీత పాడిన పాటలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఆంగ్ల పదాలు వాడకుండా తెలుగులో ఎంతసేపు మాట్లడగలరన్న పోటీలో యువకుడైన శ్రీకాంత్ మొదటి బహుమతి గెలుచుకున్నారు. ఇటువంటి కార్యక్రమాలతో జరిగిన ఈవేడుకను అందరూ సంపూర్ణంగా ఆనందించారు.

Bakersfield Telugu Association, bakta celebrated Sankranthi, bakta sankranti celebations, sankranti celebrations bakta

 

కాసుల గీత మాట్లాడుతూ “రకరకాల వంటకాలతో కూడిన విందుభోజనం, అందరి సందడి మనదేశంలోనే వున్న అనుభూతినిచ్చాయి” అన్నారు. “అందరూ కలసి తెలుగు భోజనాలు చెయ్యడం, చాలా సాంప్రదాయబద్ధంగా అనిపించింది. దేశానికి ఇంత దూరంలో వున్నా మనవాళ్ళ మధ్యలోనే వున్నట్టనిపించింది” అని కొమ్మిరెడ్డి రూప అన్నారు.

 

కార్యక్రమమంతా చాలాబాగుంది. క్రొత్త పరిచయాలు ఏర్పడడం, పిల్లలంతా కలసి కేరింతలు కొట్టడం చాలా సంతోషాన్నిచ్చాయి” అని తాళ్ళపల్లి ప్రదీప్ అన్నారు. కందిపాటి కవిత అయితే “ఇదంతా కుటుంబ వాతావరణంలా అనిపించింది. ఇంటికి తిరిగి వచ్చాక కూడా చాలాసేపు ఆ తియ్యని అనుభూతిలోనే వుండిపోయాము. ప్రతి పండుగనూ మనందరం ఇలాగే కలసికట్టుగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను” అన్నారు.

Bakersfield Telugu Association, bakta celebrated Sankranthi, bakta sankranti celebations, sankranti celebrations bakta

 

ఈమధ్యే బేకర్స్ ఫీల్డ్ వచ్చిన యువ సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు కిరణ్, శ్రీకాంత్, కల్యాణ్, మరియు ధూలిపల్లి కిరణ్ లు మాట్లాడుతూ “ఈ వూరిలో ఇంతమంది తెలుగువారుంటారని మేము వూహించనే లేదు. మన సాంప్రదాయాన్ని అనుసరిస్తూ ఇంత చక్కగా సంక్రాంతిని జరుపుకోవడం మాకు చాలా సంతోషాన్నిచ్చాయి” అన్నారు.

 

“మనదేశంలోనే మనుషుల మధ్య దూరాలు పెరిగిపోతున్న ఈరోజుల్లో, ఎవరి మటుకు వాళ్ళు అన్నట్టు కాకుండా ఒక్క కుటుంబంలా అందరం మన పండుగలు జరుపుకోవడం చాలా ముఖ్యం. రక్తసంబంధీకులకు దూరంగా వున్న మనకు మిత్రులతోనే ఒక బాంధవ్యం ఏర్పడుతుంది. ఈ బంధాన్ని బలపరచడానికి మనం ఎంతోప్రయత్నిస్తాము“ అని రాంప్రసాద్ మరియు శ్రీలత సింగంపల్లి దంపతులు అన్నారు.

 

Bakersfield Telugu Association, bakta celebrated Sankranthi, bakta sankranti celebations, sankranti celebrations bakta

 

 

TeluguOne For Your Business
About TeluguOne
;