RELATED EVENTS
EVENTS
రంగ రంగ వైభవంగా జరిగిన డిట్రాయిట్ దీపావళి వేడుకలు

తెలుగువారి సంస్కృతికి పట్టంగడుతూ, చిన్నాపెద్దలను ఆహ్లాదపరుస్తూ, డిట్రాయిట్ తెలుగు అసోసియేషన్ (DTA) ఎంతో వైభవంగా దీపావళి వేడుకలు ఈ ఆదివారం నోవై పట్టణంలో నిర్వహించారు. ఇంతకు ముందు ఎన్నడు లేనట్టుగా సుమారు 250 మంది పిల్లలు ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు, 1000 మంది విచ్చేసి అన్ని కార్యక్రమాలను విజయవంతం చేసారు.

మన సంస్కృతికి అద్దం పడుతూ – శ్రీమతి సంధ్య ఆత్మకూరి ఆధ్వర్యం లో నాట్య ధార్మి ఫౌండేషన్  “తెలుగు హృదయావళి” అనే కూచిపూడి నృత్యప్రదర్శన, శ్రీమతి ధాన్య (వాణి) రావు గారి దర్శకత్వంలో అభినయ స్కూల్ అఫ్ డాన్స్  “గిరిజా కళ్యాణం”   అనే నృత్యరూపకం అందరిని ఆకట్టుకున్నాయి. అమెరికాలో తెలుగుదనంతో Halloween చేసినట్టు “అరుంధతి కోసం మళ్ళీ వచ్చిన పశుపతి” అనే ప్రయోగాత్మక నాటకం యువతరాన్ని ఉర్రూతలూగించింది. ఇవే కాక “సిరి మువ్వలు”, “భక్త ప్రహ్లాద”, “మోహిని భస్మాసుర” అనే కార్యక్రమాలు ఒకదానిని మించిన మరొకటిగా అందరిని అలరించాయి.



 

“డెట్రాయిట్ తెలుగు కమ్యూనిటికు ఈ దీపావళి వేడుకలు ఈ ఏడాది లో DTA అందించిన 24 వ  కార్యక్రమమని” DTA ప్రస్తుత అధ్యక్షులు శ్రీ సూరపరాజు వేణుగోపాల్ గారు మాట్లాడుతూ “ఈ సంవత్సరం ఎన్నో క్రొత్త కార్యక్రమాలు చేపట్టామని – NATS వారి సౌజన్యంతో “ETV పాడుతా తియ్యగా” , గడచిన మధురస్మృతులకు అభివాదంగా “ఘంటసాల సమర్పణం”,  మిషిగన్ లో వివిధ పట్టణాలకు చెందిన తెలుగు వారి మధ్య “క్రికెట్ పోటీలు”, TANA వారి సహాయం తో Volley ball ఆటలు, మహిళలు ప్రత్యేకంగా “Ladies Night”, “రంగోలి పోటీలు”, మన సమాజ అభివృద్ధి కోసం Red cross తో రక్త దాన, VT Seva వారితో ఆరోగ్య శిబిరాలు, Soup Kitchen  ఇలా ఎన్నో మొదటి సారి చేపట్టా”మన్నారు. “క్రొత్తవి మరియు ప్రతి ఏడాది regular గా చేపట్టే అన్ని కార్యక్రమాలు విజయవంతమయ్యాయని, అందుకు ఎందరో volunteers సమిష్టిగా కృషి చెయ్యడం, DTA executive committee నిరంతర సహాయం, మిషిగన్ తెలుగు కమ్యూనిటీ ఆదరణ కీలకమని” వాలంటీర్లను, DTA executive ను గౌరవించారు.

 

డెట్రాయిట్ మరియు మిషిగన్ తెలుగు కమ్యూనిటీ కు నిరంతర నిస్వార్థ సేవ చేసిన గుర్తుగా “వడ్లమూడి వెంకటరత్నం” పురస్కారం శ్రీ పెద్దిబోయిన (Jo) జోగెశ్వరరావు గారికి, శ్రీ కోడూరి చలపతి గారికి DTA బహుకరించింది. 2014 Volunteer Appreciation Award ను శ్రీమతి సనం పద్మ గారికి అందించారు. వరుసగా 8 ఏళ్ళు పిల్లలకు తెలుగు పదజ్నాన పోటీలు నిర్వహణలో DTA కు కుడి భుజంగా సహాయపడిన డిట్రాయిట్ తెలుగు లిటరరీ క్లబ్ (DTLC) కు గౌరవపురస్కారాన్ని బహుకరించారు.



శ్రీ వేంకటేశ్వర ఆలయం, నోవై, వారు మరియూ కొల్లూరి మాధవి గారు మధురమైన తెలుగు విందు భోజనం అందించారు .

DTA వారి 2014 దీపావళి వేడుకలు ఆబాలగోపాలానికి మరువలేని స్మృతులు రుచులు అందించాయనడంలో అతిశయోక్తి ఎంతమాత్రము లేదు.

TeluguOne For Your Business
About TeluguOne
;