RELATED EVENTS
EVENTS
లాటా అద్వర్యంలో ఘనంగా నిర్వహించిన ఆరోగ్య సదస్సు



భారతీయ జీవన విధానం, ఆహార అలవాట్లు మన తెలుగు వారికి ఎటువంటి ఆరోగ్య సంభందిత నష్టాలు కలిగిస్తున్నాయి, అమెరికా లో ముఖ్యంగా సాఫ్ట్ వేర్ ఉద్యోగస్తులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని అనే విషయాలకు సంభందించి, లాస్ ఏంజల్స్ పరిధిలో నివసిస్తున్న తెలుగు వారి కోసం ప్రారంభించిన లాస్ ఏంజల్స్ తెలుగు అసోసియేషన్ (లాటా) ఈ నెల 26వ తేదిన , శనివారం నాడు ఇర్వైన్ నగరంలో నిర్వహించిన ఆరోగ్య సదస్సు ఎన్నో ఆరోగ్య విషయాలను తెలిపి అందరిని అబ్బురపరిచింది.



ప్రముఖ గుండె వైద్య నిపుణులు శ్రీ రవి జంధ్యాల గారు మరియు ప్రముఖ అంకాలజిస్ట్ శ్రీ మాధవి ముమ్మనేని గారు ముఖ్య అతిథిలు గా విచ్చేసి ఎన్నో విషయాలు  చర్చించారు.  మొదట రవి జంధ్యాల గారు గుండె జబ్బులు, వాటికి సంభందించిన కారణాలు, ఆహార అలవాట్లు గురించి విశదీకరించారు.  ఆహార విషయాల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ముఖ్యంగా మన తెలుగు వారి భోజనాల గురించి చాలా చక్కగా తెలుగులో చెప్పి అందరిని ఆలోచింప చేసారు.  అన్నం, ఆవకాయ, ఇడ్లి, దోస, గారెలు ఇలా ఒకటేమిని అన్ని రకాల ఆహార పదార్థాల గురించి, వాటిలో ఉన్న క్యాలరీస్ గురించి క్షుణ్ణంగా విశ్లేషించారు.  భోజనంలో ఆవకాయంత అన్నం, అన్నమంత కూరలు తీసుకుంటే ఎంతో మచిందని చెప్పారు.







ఆ తరువాత మాధవి గారు ప్రతి సంవత్సరము అక్టోబర్ నెల రొమ్ము క్యాన్సర్ అవగాహన నెల (Breast Cancer Awareness Month) ప్రాముఖ్యతను వివరిస్తూ వచ్చిన తెలుగు మహిళలతో ప్రత్యేకంగా స్త్రీలలో ఎక్కువగా వస్తున్న రొమ్ము క్యాన్సర్ , గర్భాశయ  క్యాన్సర్, సెర్వికల్ క్యాన్సర్ల  గురించి వివరించారు. క్యాన్సర్లను మొదటి దశలో గుర్తించడం మరియు వాటి నివారణకు తీసుకో వలసిన స్క్రీనింగ్ ఆవశ్యకతను,  జాగ్రత్తలను తెలియ పరిచారు. చివరగా ప్రశ్నోత్తర సమయంలో సభికులనుంచి సేఖరించిన ప్రశ్నలకు జవాబులిచ్చి అందరకి ఆరోగ్యం, ఆహార అలవాట్లు మరియు వ్యాయామ ప్రాముఖ్యతల గురించి అర్థమయ్యేటట్లు వివరించారు.



ఈ కార్యక్రమాన్ని లాటా కార్యవర్గ సభ్యులు రవి తిరువాయిపాటి, శ్రీనివాస్ కొమరిశెట్టి గార్లు సమన్వయకర్తలుగా వ్యవహరించి, ఇర్వైన్లో ఉన్న ఏక్తా బోర్డు మెంబర్ శ్రీ శ్రావణి జంధ్యాల సహాయ సహకారాలతో జరిగిన ఈ ఆరోగ్య సదస్సుకు విచ్చేసిన అందరిని అభినందించారు. లాటా కార్యవర్గ సభ్యులు రమేష్ కోటమూర్తి, హరి మాదాల, తిలక్ కడియాల, లక్ష్మి చిమట మాట్లాడుతూ తెలుగువారు  ప్రతిఒక్కరూ లాటా కార్యక్రమాలద్వారా లబ్ది పొందాలన్న ఉద్దేశ్యంతో వివిధ కార్యక్రమాలని నిర్వహించామని చెప్పారు. ఈ సందర్భంగా విచ్చేసిన స్థానిక సభ్యులు మానస్ బుక్కురి, కృష్ణారావు అల్లపర్తి, సురేష్ అంబటి, శ్రీకాంత్ కోచర్లకోట, శ్రావణ్ చిన్నం, వరప్రసాద్ శ్రీరంభట్ల, సూర్య గంగిరెడ్డి, శ్రీధర్ సటులూరి, శ్రీధర్ వేల్లమిన, మూర్తి దార్బ్ల, భాగ్యలక్ష్మి కొమిరిసేట్టి, రఘు మద్దుల మరియు కిశోర్ గదేవరలను మరియు ఈ కార్యక్రమానికి సహకరించిన అందరికి కృతఙ్ఞతలు తెలిపారు.  చివరగా డా. రవి జంధ్యాల గారు అందరితో "మిత మైన ఆహరం తీసుకుంటాం, తక్కువసార్లు బయటతింటాం, ఎక్కువగా వ్యాయామం చేస్తాం " అని ప్రతిజ్ఞ చేపించారు.

TeluguOne For Your Business
About TeluguOne
;