బిసిలను సెలబ్రిటీలను చేసిన పార్టీలు
posted on Aug 29, 2012 @ 11:46AM
రాత్రికే రాత్రే బిసిలను సెలబ్రిటీలను చేస్తున్నాయి రాష్ట్రంలోని రాజకీయపార్టీలు. మొదట వైసిపి పార్టీ ఉప ఎన్నికల తర్వాత సిరిపురంలో నేత కార్మికులకు దన్నుగా ఒకరోజు బహిరంగ సభ ఏర్పాటు చేసింది. దాంతో దెబ్బతిన్న పులిలా ముందుకు దూకింది టిఆర్‌యస్ పార్టీ. తమ ప్రాంతంలోకి రావడానికి ముందు తెలంగాణకు సానుకూలమో కాదోతేల్చమంది. అనేక నాటకీయ పరిణామాల మద్య వైసిపి గౌరవాధ్యక్షురాలు ఆ సభను విజయవంతం చేశారు. దానితో మిగతా పార్టీలన్నీ బిసిలను గుర్తించడంలో వెనుకబడ్డామని తెలుసుకున్నాయి. ముందుగా తెలుగుదేశం పార్టీ నాయకుడు చంద్రబాబు బిసిలకు 100 సీట్లు రానున్న ఎన్నికల్లో వారికోసం 1000 కోట్లతో ప్లానింగ్ కమీషన్ వేస్తానన్నారు. దాంతో తేరుకున్న వైసిసి సీట్లు కాదు 100 స్ధానాలకే పాటుపడదాం... చర్చలకు రండని సవాలు విసిరారు. దీంతో ఖంగుతిన్న అధికారపక్షం కులాల జనాభా నిష్పత్తిని బట్టి సీట్లు ఇద్దాం మీరు రెడీయేనా అంటూ ఈ విషయంపై తాము తమ అధినేత్రిని ఒప్పిస్తానని సవాల్ విసిరారు పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణ. ఇప్పటికే కాంగ్రెస్‌పార్టీ ఎస్సీ, ఎస్టీ ప్లానింగ్ దిశలో ముందుకు సాగుతున్నారు. దీంతో ఉన్నతవర్గాలు గుబులు చెందుతున్నాయి. ఎవరికి వారు ఓటర్లను ఆకర్షించడంలో ముందుండాలని తమకు తామే గోతులు తీసుకుంటున్నాయి. ఎందుకంటే తక్కువ జనాభాకలిగి ఎక్కువ పదవులు పొందుతున్న వారు అగ్రకులానికి చెందిన రెండు కులాలవారు మాత్రమే. ఇప్పుడు ఎవరు దీన్ని సమర్ధించినా అంతే సంగతులు.....