ఓటు నొక్కకుండానే,ఆగిన గుండె
posted on Jun 13, 2012 @ 11:10AM
వృద్ధాప్యం ... అసలు నడవటమే కనా కష్టం. కాళ్ళు సాగాదీసుకుని కొంచెం ఓపిక చేసుకుని పోలింగ్ కేంద్రానికి వెళ్ళింది. అక్కడ సిబ్బంది ఎన్నికల నిబంధనల ప్రకారం ఆమె అర్హతను పరీక్షించారు. వృద్దురాలైనా సరైన ఆధారాలతో ఓటెయ్యటానికి వచ్చిందని సంతృప్తి చెందారు. ఆమె ఎడమచేతి చూపుడువేలికి ఇంకు వేశారు. నెమ్మదిగా ఆమె ఈవిఎం దగ్గరకు చేరుకుంది. చుట్టూ ఒకసారి చూసింది. చేయి నెమ్మదిగా ఈవిఎం వైపు ఎత్తి సరిగ్గా ఓటు వేసే సమయానికి కుప్పకూలింది. ఆమె గుండె ఆగిపోయింది. ఈ సంఘటన నెల్లూరు జిల్లా మర్రిపాలెం మండలం కండ్రిక పోలింగ్ స్టేషన్ లో జరిగింది. ఆ వృద్ధురాలి పేరు శేషమ్మ. ఈవిఎం నోక్కకుండానే చేనిపోయిన శేషమ్మ అసలు ఆమె ఎవరికీ ఓటు వేయటానికి వచ్చిందనే సందేహాన్ని మిగిల్చింది. అన్నీ ఉచితంగా అందజేస్తామన్న తెలుగుదేశం పార్టీకా? సానుభూతి ప్రచారంతో ముందుకు వచ్చిన వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీకా? వచ్చీరాని తెలుగు మాట్లాడే సిఎం కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకా? అన్నది మాత్రం తేలలేదు.