వీణా,వాణిల వంతు ఎప్పుడు
posted on Jun 23, 2012 @ 5:43PM
మద్యప్రదేశ్‌లోని బేతుల్‌జిల్లా పాదర్ లో అవిభక్త కవలలుగా పుట్టిన స్తుతి , ఆరాధన 23 మంది డాక్టర్లు , 34 మంది వైద్య సిబ్బంది కలిసి నాలుగు దశల్లో చేసిన ఆపరేషన్ విజయవంతం అయింది. ఈ ఆపరేషన్ కు మద్యప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం 20 లక్షలు కేటాయించింది. గత ఏడాది మే 2న మాయా యాదవ్‌లకు జన్మించిన స్తుతి, ఆరాధన అవిభక్త కవలలను ఆ తల్లి దండ్రులు ఆసుపత్రిలోనే వదిలారు. ఇప్పుడు ఈ ఆపరేషన్ సక్సెస్ అయినందుకు గాను వారు ఎంతగానో సంతోషపడుతున్నారు . మరి మన వీణా వాణి ల మాటేమిటి ? వారి తల్లిదండ్రులు కూడా పేదవారు కావడం వల్ల వారు గుంటూరు మెడికల్ హాస్పిటల్ లోనే పిల్లలను వదిలి వెళ్లారు. ప్రొఫెసర్ నాయుడమ్మ వారి సంరక్షణ బాధ్యత తీసుకున్నారు. అదిగో ఇదిగో అంటూ కాలం గడిచి పోయింది. ప్రొఫెసర్ నాయుడమ్మ రిటైర్ అయ్యారు. వాణి వీణ తల్లిదండ్రులు నాయుడమ్మే ఆపరేషన్ చేయాలని ఎంతగా ప్రభుత్వాన్ని కోరినప్పటికి ఫలితం లేకుండా పోయింది. ఆ తరువాత వారు హైదరాబాద్ నిమ్స్‌లో అలాగే వుండి పోయారు గాని ఇప్పటివరకు ప్రభుత్వం కాని కార్పొరేట్ డాక్టర్లు కాని పట్టించు కోకపోవడం విచారకరం.