ఢిల్లీకి ధీటుగా తెలంగాణాలో స్వాతంత్య్రవజ్రోత్సవం
posted on Jul 28, 2022 @ 10:59AM
స్వాతంత్య్రదినోత్సవం అనగానే ఢిల్లీ ఎర్రకోట మీద జాతీయ జండా ఎగరవేయడం ప్రధాని మాట్లా డటం అనాదిగా వింటున్నది, చూస్తున్నది. రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు జాతీయజండా ఎగురవేసి రాష్ట్ర ప్రజల నుద్దేశించి ప్రసంగించడం మామూలే. కాగా ఈసారి దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్త వుతున్న సందర్భంగా తెలంగాణా ప్రభుత్వం పెద్ద స్థాయిలో స్వాతంత్య్ర వజ్రోత్సవాలను జరపా లని నిర్ణయించను న్నారు. కేంద్రానికి ధీటుగా తెలంగాణా రాష్ట్రం తమ జాతీయతను ప్రదర్శించడానికి గట్టి నిర్ణయం తీసు కుంది.
అయితే ఇది రాజకీయపరంగా కేంద్రానికి చిన్నషాక్ ఇవ్వాలన్న లక్ష్యంతోనే ఈ నిర్ణయం తీసుకు న్నారన్న అభిప్రాయాలే వ్యక్తమవుతున్నాయి. ఇటీవలి రాజకీయ పరిణామాల పరంగా చూస్తే బీజేపీ ఎలాగయి నా తెలంగాణాలో కేసీఆర్ ప్రభుత్వాన్ని దించేయాలన్న లక్ష్యంతో శాయశక్తులా ప్రయత్ని స్తోంది. అయితే బీజేపీ వ్యూహాలకు ప్రతివ్యూహాలు రచిస్తూ బీజేపీని రాష్ట్రంలో అడుగు ముందుకు పడనీ యకుండా అడ్డుపడుతూ కేసీఆర్ ప్రభుత్వం తమ ప్రత్యేకత చాటుతోంది. కాగా తాజాగా స్వాతంత్య్ర దినోత్సవ సంద ర్భాన్ని కూడా అందుకుపూర్తిగా వినియోగించాలన్న తలంపుతోనే కేసీఆర్ ప్రభుత్వం ప్రత్యేకంగా నిర్వ హించాలన్నగట్టి నిర్ణయం తీసుకున్నది.
తెలంగాణలో 15 రోజుల పాటు వివిధ కార్యక్రమాలను నిర్వహించాలని నిర్ణయించినట్లు వజ్రోత్సవ కమిటీ ఛైర్మన్, ఎంపీ కె.కేశవరావు తెలిపారు. స్వాతంత్య్ర వజ్రోత్సవాల నిర్వహణపై ఎంపీ కేశవరావు ఆధ్వర్యం లోని కమిటీ ఇటీవల మొదటి సారిగా భేటీ అయింది. ఈ సందర్భంగా బీఆర్‌కేఆర్ భవన్‌లో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో కేశవరావు మాట్లాడుతూ ఆగస్టు 8 నుంచి 22 వరకు వజ్రోత్సవాలు నిర్వహిం చాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఆగస్టు 8న హెచ్ఐసీసీలో వజ్రోత్సవ వేడుకలను సీఎం కేసీఆర్ ప్రారం భిస్తారని తెలిపారు.
రాష్ట్ర వ్యాప్తంగా కోటి ఇళ్లపై జాతీయ జెండా ఎగురవేసేలా, గడపగడపకూ దీపాలు వెలిగించేలా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. ట్రాఫిక్ సిగ్నళ్ల వద్ద ఒకేసారి ఒక రోజు ట్రాఫిక్‌ను ఆపి జనగణమన కూడా పాడిస్తామని పేర్కొన్నారు.
ఆగస్టు 22న ఎల్‌బీ స్టేడియంలో ప్రత్యేక కార్యక్రమం చేపడతామని, ఆ సమావేశానికి ఒక్కో జిల్లా నుంచి వెయ్యిమంది వచ్చేలా చర్యలు చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. హైదరాబాద్ నగరమంతా స్వాతం త్య్ర సమరయోధులు, పోరాట నాయకుల చిత్రాలు, త్రివర్ణాలతో తీర్చిదిద్దేలా ఏర్పాట్లు చేస్తామన్నారు.