తెలంగాణ జెఎసి జోరు , కాంగ్రెస్ బేజారు
posted on Oct 4, 2012 @ 1:09PM
సెప్టెంబరు 30న జరిగిన తెలంగాణ మార్చ్ తరువాత కోదడరాం నడిపుతున్న తెలంగాణ జెఎసి మీద అంచనాలు విపరీతంగా పెరిగాయి. ఆ రోజు జరిపిన మార్చ్‌కు తెలంగాణ ప్రజలనుండి, అన్ని పార్టీల తెలంగాణ నాయకులనుండి అశేష మద్దతు పెరగటంతో టిజాక్ పైనే అందరి ధృష్టీ పడిరది. ఈ రోజు జరుగుతున్న కార్యాచరణ సదస్సు పైనే అందరి అంచనాలు ఉన్నాయి. ఎవరి దారి వారిదైనా అందరూ కలసి తెలంగాణ రాష్ట్ర సాధన కోరకు పరిశ్రమించడం పై టిజాక్‌కు అదృష్టం వరించింది. అయితే అధికార కాంగ్రెస్ ఎమ్మేల్యేలకు, ఎంపిలకు మాత్రం కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. మళ్లీ ఎక్కడ పదవులకు రాజీనామా చెయ్యమంటారో అని మధన పడుతున్నారు. అదే జరిగితే రానున్న రోజుల్లో రాజీనామా చేస్తే రావల్సిన ఫండ్సు ఆగిపోతాయంటున్నారు. తాము ప్రాతినిద్యం వహించే నియోజక వర్గానికి ఏమీ చెయ్యలేమని దాంతో ప్రజలకు జవాబు చెప్పలేని పరిస్థితి ఏర్పడుతుందని వారు భయపడుతున్నారు. అందుకే వారు తప్పించుకు తిరుగుతున్నారని తెలుస్తుంది. తెలంగాణ మార్చ్ కు అనుమతి తెచ్చింది టి కాంగ్రెస్ మంత్రులు, ఎంపిలు, ఎమ్మేల్యేలే అయినా వారిలో చాల కొద్ది మంది మాత్రమే పాల్గోన్నారు. మిగతా వారు ఇంటికే పరిమిత మయ్యారు. ఏది ఏమైనా తెలంగాణ జెఎసి జోరు టి కాంగ్రెస్ వారికి తలనొప్పిగా మారింది.