జిల్లాల పునర్విభజనపై కమిటీ : సీఎం రేవంత్‌రెడ్డి
posted on Jan 12, 2026 @ 3:29PM
తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ సెంట్రల్ అసోసియేషన్ 2026 డైరీ & క్యాలెండర్‌ను సీఎం రేవంత్‌రెడ్డి ఆవిష్కరించారు. ప్రభుత్వ ఉద్యోగులందరికీ, రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. త్వరలో జిల్లాల పునర్విభజన కోసం రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు సీఎం తెలిపారు. ఆ కమిటీ రాష్ట్రమంతా తిరిగి అభిప్రాయాలు స్వీకరిస్తుందని...6 నెలల్లో రిపోర్ట్ ఇవ్వాలని కోరతామని తెలిపారు. గతంలో నాయకులు నచ్చినట్లు జిల్లాలు ఏర్పాటు చేశారు. జిల్లాల సరిహద్దులు మార్చాలని విజ్ఞప్తులు వస్తున్నాయి.
మండలాలు, రెవెన్యూ డివిజన్లనూ పునర్వ్యవస్థీకరిస్తామని సీఎం తెలిపారు. మల్కాజ్‌గిరి మేం పెట్టలేదు. తీయలేదు. రాచకొండ ఒక్కటే రాజులను తలపించేలా ఉందన్నారు. సికింద్రాబాద్ పేరు ఎక్కడ ఉంది? తీసేసింది ఎక్కడ? జీహెచ్‌ఎంసీలో భాగంగా సికింద్రాబాద్ ఉంది అని రేవంత్‌రెడ్డి అన్నారు. సంఘాల నాయకులు ప్రభుత్వంతో కుమ్మక్కయ్యారని అనుకుంటున్నారని చెబుతున్నారు. మనమంతా ఒకే కుటుంబం… కుటుంబంలో కుమ్మక్కులు ఏం ఉంటాయిని సీఎం స్పష్టం చేశారు.
ఉమ్మడి కుటుంబంలో కలిసి ఉంటే చూడలేని వారు, కడుపులో విషం పెట్టుకునే వారు ఎప్పుడూ ఉంటారని తెలిపారు. ప్రభుత్వాన్ని నడిపేది కేవలం ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు మాత్రమే కాదు.. పదిన్నర లక్షల మంది ఉద్యోగులు కూడా ఇందులో భాగస్వాములేని తెలిపారు. మీరే మా సారధులు, మా వారధులు.. మీ సోదరుడిగా మీకు అండగా ఉంటాని ముఖ్యమంత్రి తెలిపారు. గతంలో మీ జీతాలు ఎప్పుడొచ్చేవి.. ఇప్పుడు ఎప్పుడు వస్తున్నాయో ఒకసారి ఆలోచించండని ఉద్యోగులను ప్రశ్నించారు.
సంక్రాంతి కానుకగా మీ డీఏపై సంతకం చేసి వచ్చా.. మీ ఆరోగ్య భద్రత విషయంలో పూర్తిస్థాయిలో భరోసా ఇచ్చే చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి వివరించారు. ఉద్యోగులకు ప్రమాద బీమా కోటి రూపాయలు ఇచ్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు. ఉద్యోగుల రిటైర్మెంట్ బెనిఫిట్స్ సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తాం..ఇదొక బాధ్యత.. అందరం కలిసికట్టుగా బాధ్యతను నిర్వహిస్తేనే పరిపాలన పరుగులు పెడుతుందని సీఎం రేవంత్ వెల్లడించారు.