అప్పటివరకు ఓపిక పడదాం: టి కాంగ్రెస్ నేతలు
posted on Apr 3, 2011 @ 3:01PM
హైదరాబాద్: తెలంగాణ అంశంపై కాంగ్రెస్ అధిష్టానం సూచన 5 రాష్ట్రాల విధానసభలకు ఎన్నికలయ్యేవరకు ఓపిక పట్టాలని తెలంగాణ కాంగ్రెస్ ప్రతినిధులు నిర్ణయించారు. తెలంగాణ కాంగ్రెసు ఎంపీలు నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్సులో సమావేశమయ్యారు. భవిష్యత్తు కార్యాచరణపై చర్చించారు. ఈ సందర్భంగా మే చివరి వారం వరకు కేంద్రానికి సమయం ఇవ్వాలని ఆ తర్వాత తెలంగాణకు అనుకూలంగా ప్రకటన రాకుంటే కేంద్రంపై ప్రత్యక్ష ఆందోళనకు దిగేందుకు సిద్ధమయినట్లుగా తెలుస్తోంది. మే తర్వాత ఉద్యమాన్ని కాంగ్రెసు పార్టీ అధ్వర్యంలో ఉధృతం చేయాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. ఇందులో భాగంగా ఓ యాక్షన్ కమిటీని వేయాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. తెలంగాణకు చెందిన అన్ని పార్టీల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సంతకాలతో కేంద్రానికి ఓ లేఖను కూడా రాయాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. ఇతర అంశాల జోలికి వెళ్లకూడదని, అలా చేస్తే ముఖ్యమైన తెలంగాణ అంశం పక్కదారి పట్టే అవకాశాలు ఉన్నాయని వారు భావించినట్టుగా తెలుస్తోంది. కాంగ్రెసు ఆధ్వర్యంలో వేసే కమిటీ ద్వారా ఉద్యమాన్ని ఉధృతం చేసి కేంద్రానికి తెలంగాణ సెంటిమెంటు ప్రధాన్యత చెప్పాలని అనుకున్నట్లుగా తెలుస్తోంది.