తెలంగాణా కోసం సాయుధ పోరాటం ?
posted on Aug 17, 2012 @ 4:06PM
గతచరిత్రను సరిగ్గా అర్థం చేసుకోకుండా తెలంగాణావాదులు తప్పటడుగులు వేస్తున్నారు. మొన్నటికి మొన్న కేసిఆర్ తన మాటల్లో నన్నయ్యను అనువాదకవిగా చిత్రీకరించేందుకు ప్రయత్నించారు. నిన్న నాటి రజాకర్లపై తెలంగాణా తిరుగుబాటును ప్రత్యేకరాష్ట్రం కోసం కూడా అనుసరించాలని కొందరు పిలుపు ఇచ్చారు. అంటే అప్పట్లో సాయుథపోరాటాన్ని నేటి తరం అనుసరించాలని అపార్థం చేసుకునేలా కొందరు నేతలు ప్రసంగించారు.
దీంతో మావోయిస్టుల తరహాలో ఆయుధ పోరాటంతోనే తెలంగాణా సాధిస్తామని దసర్ల శ్రీశైలం ఓ పదిమందితో మిలిటెంట్ గ్రూపును తయారు చేశారు. ఆ పదిమంది ప్రధానలక్ష్యం మంత్రులను హత్య చేయటమే. ఇలా హత్య చేస్తేనే తెలంగాణా వచ్చేస్తుందని ఈ గ్రూపు భావించేలా శ్రీశైలం కృషి చేశారు. అయితే విషయం బయటకు పొక్కటంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. ఈసారి ఎటువంటి అవాంఛనీయసంఘటనలకు తావులేకుండా ముందుగానే పూర్తి ఆధారాలతో పోలీసులు శ్రీశైలాన్ని అరెస్టు చేశారు. ఈయనతో పాటు మరో ఇద్దరిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
శ్రీశైలం ఓయూ స్వతంత్య్రజాక్ కో`కన్వీనర్‌గా పని చేస్తున్నారు. ఎల్‌ఎల్‌బి మూడో సంవత్సరం చదువుతున్న శ్రీశైలం మిలిటెంట్ గ్రూపును తయారు చేయటమే కాకుండా మథ్యప్రదేశ్‌ను రూ.35వేలకు ఒక పిస్టల్‌ను, మూడు తపంచాలను కొనుగోలు చేశారు. మంత్రులు డికె అరుణ, జానారెడ్డి, కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ఇంజనీరు కాశిలను శ్రీశైలం ఫోను ద్వారా బెదిరించారు. ఇప్పుడు పోలీసుల అదుపులో ఉన్న శ్రీశైలం తాము మంత్రులను హత్య చేద్దామనుకున్నా లక్ష్యాన్ని నిర్ధారించుకోలేని స్పష్టం చేశారు. చరిత్రను అపార్థం చేసుకునే ఈ మిలిటెంట్‌గ్రూపు ఏర్పాటుకు శ్రీశైలం కారణమయ్యారని పరిశీలకులు అంటున్నారు. అయితే శ్రీశైలంకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది.