టి.డి.పి.రైతు ధర్ణాకు రైతులు దూరం
posted on Jul 2, 2012 @ 10:18AM
సత్యరమే రైతుల సమస్యలను పరిష్కరించాలనికోరుతూ ఆదిలాబాద్‌లో పట్టణ తెలుగుదేశం పార్టీ నాయకులు కలక్టరేట్‌వద్ద పెద్ద ఎత్తున ధర్నాచేపట్టారు. ఎంపీ రాధోడ్‌రమేష్‌తోపాటు ఎమ్మేల్యేలు గడ్డం నగేష్, సుమన్‌రాధోడ్ మరికొంతమంది నాయకులు పాల్గొన్నారు. రైతుల పట్ల ప్రభుత్వవైఖరిని వారు ఎండగట్టారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఎరువుల ధరలను పెంచారని, విత్తనాలకై కొందరు వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టించి రైతులను ఆందోళనకు గురిచేస్తున్నా వారిని అధికారులు పట్టించుకోవడంలేదని తెలిపారు.అధికార యంత్రాంగం దళారులకు కొమ్ముకాస్తూ రైతు సంక్షేమాన్ని విస్మరించిందని వారు అన్నారు. వెంటనే రైతుల సమస్యలు పరిష్కరించాలని లేని పక్షంలో తెలుగుదేశం పార్టీ ఆందోళనను తీవ్రతరం చేస్తుందని వారు స్పష్టంచేశారు. అయితే ఈ కార్యక్రమంలో కార్యకర్తలు, రైతులు దూరంగా ఉన్నారు. జిల్లా నలుమూలలనుండి నాయకులే తరలివచ్చారు. తెలంగాణవాదం బలంగావుండటం రైతులు పొలం పనుల్లో పడటంవల్ల ఈ పరిస్థితి తలెత్తిందని నాయకులు చెబుతున్నప్పటికీ కార్యకర్తలు, రైతులు హాజరవకపోవడం నాయకత్యాన్ని ఆందోళనకు గురిచేసిందని తెలుస్తుంది.