కల్మాడీ కి చెప్పుదెబ్బ
posted on Apr 26, 2011 @ 3:29PM
న్యూఢిల్లీ: కామన్వెల్త్ క్రీడల నిర్వహణ కమిటీ మాజీ అధ్యక్షుడు సురేష్ కల్మాడీకి పాటియాలా కోర్టు ఆవరణలో పరాభవం ఎదురైంది. కామన్వెల్త్ క్రీడల కుంభకోణం కేసులో అరెస్టయిన సురేష్ కల్మాడీని సీబీఐ అధికారులు పాటియాలా కోర్టు ముందు హాజరుపరిచేందుకు తీసుకెళ్లారు. పాటియాలా కోర్టుకు సురేష్ కల్మాడీతో పాటు ఏఎస్‌వి ప్రసాద్ కూడా హాజరయ్యారు. కానీ కోర్టు ఆవరణలోనే గుర్తు తెలియని వ్యక్తి కల్మాడీపై చెప్పుతో దాడి చేశాడు. అనంతరం కల్మాడీని పాటియాలా కోర్టులో సీబీఐ ప్రవేశపెట్టింది. పది రోజుల పాటు విచారణ నిమిత్తం సీబీఐ రిమాండ్ కోరనుంది. కాగా సురేష్ కల్మాడీపై చెప్పుతో దాడి చేసిన వ్యక్తిని పోలీసులు అదుపులో తీసుకున్నారు. మరోవైపు కల్మాడీతో పాటు కోర్టులో హాజరైన ఏఎస్‌వి ప్రసాద్ కూడా కోర్టులో సీబీఐ హాజరు పరిచింది. కామన్వెల్త్ కుంభకోణం కేసులో ఏకేఆర్ సంస్థకు లింకు ఉందని తేలింది. హైదరాబాద్ ఏకేఆర్ సంస్థకు రూ.23కోట్లు బదిలీ అయినట్లు సీబీఐ అధికారులు విచారణలో తేల్చారు. సీడబ్ల్యూజీ జేడీగా కొనసాగుతూనే ఏఎస్‌వి ప్రసాద్ ఏకేఆర్ కన్స్‌స్ట్రక్షన్ నడిపినట్లు తెలియవచ్చింది.