అవినీతికి కేరాఫ్ అడ్రస్‌లా మారుతోందా!
posted on Oct 8, 2012 7:22AM
ఇంకా నామకరణం కూడా పార్టీ అప్పుడే ఓ అవినీతి బాంబ్‌ను పేల్చింది యుపిఎ సర్కార్‌లో ప్రధాన పార్టీ అయినా కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీగారి అల్లుడిపై... అది కూడా మామూలుగా కాదు 300 కోట్లు... ఇండియన్ ఎగైనెస్ట్ కరప్షన్ సభ్యులు అరవింద్ కేజ్రీవాల్, ప్రశాంత్ భూషణ్‌లు రియల్ ఎస్టేట్ సంస్థ డిఎల్‌ఎఫ్ నుండి వడ్డీలేకుండా 65 కోట్ల రూపాయల రుణం పొందారని, అలాగే కోట్లాది రూపాయల ఆస్తులను ఎలాంటి పూచీకత్తు లేకుండా కొనుగోలు చేశారని.. కేవలం మూడేళ్ళ కాలంలో తన ఆస్తులను 50 లక్షల నుండి 300 కోట్ల రూపాయలకు పెంచుకున్నారని ఆరోపించారు. ప్రస్తుతం వాద్రాకు ఐదు కంపెనీలు వున్నాయన్నారు. ఆయా కంపెనీలు వ్యాపార లావాదేవీల ద్వారా సంపాదిందేమీ లేదని.. వడ్డీ ద్వారా పొందిన ఆదాయమేనని అన్నారు. దీనిపై స్పందిస్తూ.. సోనియాగాంధీ తీవ్రంగా ఖండిరచారు. వాద్రా వ్యాపారవేత్త అని ఆయనకు అనేక వ్యాపారాలున్నాయని చెప్పారు. అక్రమాలకు పాల్పడవలసిన అవసరం లేదని ఆమె ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ ఆరోపణల వెనుక బిజెపి హస్తం ఉందని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధులు విమర్శించారు. ఈ వ్యవహారంపై విచారణ జరిపితే నిజానిజాలేవో బయటకు వస్తాయని బిజెపి అధికార ప్రతినిధి ముక్తార్ అబ్బాస్ సఖ్వీ పేర్కొన్నారు. ఏమిటో... దేశం అవినీతి కేరాఫ్ అడ్రస్‌లా మారుతోందేమో అనిపిస్తోంది. ఎంతోమందిపై అవినీతిఆరోపణలు వస్తున్నాయి... దానికి సాక్ష్యాధారాలున్నాయని ఇంకొందరు చెబుతున్నారు. కేవలం రాజకీయ ఆటలకోసం కాకుండా అధికార, ప్రతిపక్ష, మిత్రపక్షమన్న భేదంలేకుండా అవినీతి ఆరోపణలు వచ్చిన లేదా ఎదుర్కొంటున్న అందరిపై త్వరితగతిన విచారణ చేపట్టి నిజాలు బయటకు తీస్తే ఆరోపణలు రుజువైన వారికి రాజకీయబహిష్కరణతో పాటు ఆస్తులను జప్తుచేసి అలా సేకరించిన ఆస్తులకు సుప్రీంకోర్టు న్యాయమూర్తులచే ఓ సంఘం ఏర్పాటుచేసి వారి ద్వారా ప్రజోపయోగ కార్యక్రమాలకు వాటిని నిజాయితీగా, లోపాలు లేకుండా ఖర్చుచేయించేలా చూస్తే దేశం వచ్చే ఐదారేళ్ళలోనే అద్భుతమైన ప్రగతి సాధిస్తుందని సామాన్య ఆశాజీవి ఆశ. అయితే ఆరోపణల్లో నిజానిజాలు ఎలా వున్నా అవి నిరూపణ కావాలిగా.. కానివ్వాలిగా...! మనది ప్రజాస్వామ్యం...! పాలకుల చేతుల్లో, పార్టీల చేతుల్లో వున్న ప్రజాస్వామ్యం.