వైసీపీకి పోయేకాలం ఆలోచనలు!
posted on May 18, 2024 @ 3:11PM
ఏపీలో అల్లర్లపై ఈసీ ఆదేశాలతో 13 మంది సభ్యులతో ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. ఈ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్‌కి ఐపీఎస్ అధికారి వినీత్ బ్రిజ్‌లాల్ నేతృత్వం వహిస్తారు. ‘సిట్’ సభ్యులుగా 13 మంది సీనియర్ పోలీస్ అధికారులను నియమించారు. అయితే, వైసీపీ నాయకులకు మాత్రం ‘సిట్’ ఏర్పాటు కంటగింపుగా మారింది. ఈ సన్నాసులు చేసిన చెత్త పనులన్నీ సిట్ బయటపెడుతుందని భయపడుతున్నారు. ఎన్నికల కోడ్ లేకుండా వుంటే తాము ‘సిట్’ అటే కూర్చుని, ‘స్టాండ్’ అంటే నిల్చునే వాళ్ళతో ‘చాలా పద్ధతి’గా విచారణ జరిపించి వుండేవారు. ఈ ‘సిట్’ ఈసీ ఆదేశాలతో ఏర్పడింది కాబట్టి ఇక్కడ వీళ్ళ పప్పులు ఉడకవు. అందుకే వంక దొరకనమ్మ డొంక పట్టుకుని ఏడ్చిందన్నట్టు ‘సిట్’ ఏర్పాటులో రంధ్రాన్వేషణ్ మొదలుపెట్టారు. సిట్ చీఫ్‌గా నియమితులైన వినీత్ బ్రిజ్‌లాల్‌ని అర్జెంటుగా తప్పించాలని వైసీపీ డిమాండ్ చేస్తోంది. ఎందుకయ్యా అంటే, ఎప్పుడో చాలా సంవత్సరాల క్రితం ఎవరిదో పెళ్ళి జరిగితే, దానికి వినీత్ బ్రిజ్‌లాల్, చంద్రబాబు హాజరయ్యారట. ఇద్దరూ కలసి పెళ్ళికి వెళ్ళికపోయినా, ఇద్దరూ ఒకేసారి పెళ్ళికి వెళ్ళారు కాబట్టి, వీళ్ళిద్దరి మధ్య స్నేహసంబంధాలు ఉండే అవకాశం వుందట. అందువల్ల ఆయన్ని సిట్ బాధ్యత నుంచి తప్పించాలట. పోయేకాలం వచ్చినవాళ్ళకి పనికిమాలిన ఆలోచనలన్నీ వస్తాయంటారు చూశారా.. ఇదీ అలాంటిదే!