చెరువుగట్టున రెండువేల సిమ్ కార్డులు?
posted on Aug 22, 2012 @ 5:30PM
సామాన్యుడికి సిమ్ కార్డు ఇవ్వాలంటే సవాలక్ష ప్రొసీజర్లు. అవిలేవు ఇవి లేవంటూ వందసార్లు సర్వీస్ ప్రొవైడర్లు తిప్పుకుంటారు. అన్నీ సవ్యంగానే ఉన్నా అసలు నువ్వోకాదో ఫోటోలో సరిగ్గా కనిపించడంలేదంటూ తెగ యాతన పెట్టేస్తారు. కానీ తూర్పు గోదావరి జిల్లా మండపేట మండలం ధర్మగుండం చెరువదగ్గరమాత్రం రెండు వేల సిమ్ కార్డులు గుట్టగా పడున్నాయ్. అవసలు అక్కడికెందుకొచ్చాయో, ఎవరు అక్కడ పడేశారో కూడా అంతుచిక్కని పరిస్థితి. అసలా సిమ్ కార్డులన్నీ సరైనవేనా లేకా అసాంఘిక శక్తులు ఉపయోగించుకుని, వదిలించుకోవడానికి అక్కడ పారేసిపోయారా అన్న ప్రశ్నలకూ సమాధానం లేదు. వేలకొద్దీ సిమ్ కార్డులు గుట్టగా పడున్న చోద్యాన్ని చూసేందుకు చుట్టుపక్కల గ్రామాలనుంచి జనం తండోపతండాలుగా వస్తున్నారు. పత్రాలన్నీ సవ్యంగానే ఉన్నా వందసార్లు తిప్పుకునే సర్వీస్ ప్రొవైడర్లు ఈ సిమ్కార్డుల విషయంలో ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించారో చూసి ముక్కన వేలేసుకుంటున్నారు. అసలన్ని సిమ్ కార్డులు చెరువగట్టుకు ఎలాచేరాయన్న విషయంపై పోలీసులు ఆరాతీస్తున్నారు.