సత్తిబాబుకు షాక్‌ట్రీట్‌మెంట్ తప్పదా?
posted on Aug 24, 2012 8:02AM
పీసిసి చీఫ్ బొత్సా సత్యన్నారాయణ(సత్తిబాబు)కు కాంగ్రెస్ అధిష్టానం షాక్ ‘ట్రీట్’మెంట్ ఇచ్చేలా ఉంది. ఇటీవల చాలా విషయాల్లో ఆయన సీఎంతో విభేదించి చేసిన పత్రికాప్రకటనలతో దొరికిపోయారు. అవన్నీ ఒకవైపు పార్టీకి, రెండోవైపు ప్రభుత్వానికీ ఇబ్బందికరంగా పరిణమించాయని అధిష్టానం కూడా సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డితో ఏకీభవించింది. అందుకని ఆయన్ని పార్టీ పదవి అంటే పీసిసి చీఫ్ స్థానం నుంచి తప్పించాలని నిర్ణయం తీసుకుందని తాజా సమాచారం తేటతెల్లం చేస్తోంది. ఇప్పటి దాకా సీఎంపై ఒంటికాలిపై లేచిన సత్తిబాబు పదవి మారుతోందన్న విషయం తెలిసి డిఫెన్స్‌లో పడి చివరాఖరుగా తన వంతు ప్రయత్నాలు చేసుకుంటున్నారని సమాచారం.
ఎఐసిసి నేత వాయలార్‌రవికి తనను కాపాడే బాధ్యతను అప్పగించేందుకు సత్తిబాబు తెగకష్టపడ్డారని తాజా సమాచారం. అయితే వాయలార్‌రవి కూడా తెలివిగా అవకాశముంటేనే చూడగలనని తప్పించుకున్నారని తెలుస్తోంది. దీంతో తనకు ఇతర నేతలతో ఉన్న పరిచయాలను కూడా సత్తిబాబు ఉపయోగించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిసింది. అకస్మాత్తుగా అధిష్టానం నిర్ణయం మార్చుకోవటానికి మాత్రం సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ఢల్లీి పర్యటనే కారణమని విశ్లేషకులు తేలుస్తున్నారు. బొత్సా తరువాత రేసులో ఉన్న నేతల జాబితాను ముందేసుకుని ఎఐసిసి నేతలు పరిశీలిస్తున్నారని తెలుస్తోంది. మేడమ్ సోనియాతో మాట్లాడటానికి ముందుగానే నేతలు ఈ హోంవర్కు చేస్తున్నారు. ఈసారి ప్రకటించే నేత 2014 ఎన్నికల నేపథ్యానికి సహకరించేలా ఉండాలని మైనస్, ప్లస్‌లు నేతల పేర్ల పక్కన రాసుకుని దాన్ని మేడమ్‌తో చర్చించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. రెండురోజుల సుదీర్ఘచర్చ తరువాతే కొత్తనేత పేరు ప్రకటించాలని కాంగ్రెస్‌అధిష్టానం భావిస్తోందట. ఏమైనా బొత్సా తనకు జరుగుతున్న ఈ షాక్‌ట్రీట్‌మెంట్‌తో దారి కొస్తారా? లేక పక్కదారి పడతారా? అని పలువురు నేతలు గాంధీభవన్‌లో చర్చించుకుంటున్నారు.