త్వరలో తమిళనాడు సీఎంగా శశికళ..!
posted on Dec 21, 2016 @ 9:46AM
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణానంతరం పన్నీర్ సెల్వం ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే గత కొద్ది రోజుల నుండి అమ్మ నెచ్చెలి అయిన శశికళ ముఖ్యమంత్రి బాధ్యతలు కూడా చేపడతారని కథనాలు వస్తున్నాయి. ఇప్పటికే పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఆమెను నియమించిన పార్టీ పెద్దలు.. ఇప్పుడు ముఖ్యమంత్రిగా కూడా ఆమెనే బాధ్యతలు స్వీకరించాలని కోరుతున్న సంగతి తెలిసిన విషయమే. దాంతో ఆమె ఎప్పుడు సీఎంగా బాధ్యతలు స్వీకరిస్తారా అని అందరూ అనుకుంటున్నారు. ఇప్పుడు ఈ విషయంపైనే అన్నాడీఎంకే రాజ్యసభ సభ్యుడు నవనీతకృష్ణన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ మీడియా సమావేశంలో పాల్గొన్న ఆయనకు శశికళ కోసం పన్నీర్‌సెల్వం తన ముఖ్యమంత్రి పదవిని వదులుకుంటారా? అని ప్రశ్నించగా... దానికి నవనీతకృష్ణన్ స్పందిస్తూ ‘చిన్నమ్మ’ తలచుకుంటే డిసెంబరు 5నే ముఖ్యమంత్రి అయ్యేవారని, ఆమెను ఎవరూ ప్రశ్నించలేరని తెలిపారు. అంతేకాదు.. త్వరలో చిన్నమ్మ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడతారని తెలిపారు. మరి ఆఖరికి ఏం జరుగుతుందో తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే.