వడ్డీ రేట్లు తగ్గించిన ఆర్బీఐ

ఆర్బీఐ కీలక వడ్డీ రేట్లను సవరించడం వరుసగా ఇది రెండవ సారి. ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా బుధవారం (ఏప్రిల్ 9) ఉదయం ద్రవ్యపరపతి విధాన కమిటీ నిర్ణయాలను వెల్లడించారు. రెపో రేటును 0.25 శాతం మేర తగ్గించింది. దీంతో ఇప్పుడున్న  6.25 నుంచి 6 శాతానికి రెపో తగ్గింది. ఈ తగ్గింపుతో హోమ్‌, వెహిక‌ల్‌, ప‌ర్స‌న‌ల్ రుణాల‌పై వ‌డ్డీ రేట్లు త‌గ్గ‌నున్నాయి.

గత ఫిబ్రవరిలోనూ ఆర్బీఐ వడ్డీ రేట్లను తగ్గించిన సంగతి తెలిసిందే.  దేశీయంగా ద్ర‌వ్యోల్బ‌ణం నియంత్ర‌ణలోనే  ఉండటం, ముఖ్యంగా  ఆహార ప‌దార్థాల ధ‌ర‌లు త‌గ్గుముఖం ప‌ట్ట‌డంతో   ఆర్థిక వృద్ధికి దోహదపడేలా వడ్డీ రేట్లను తగ్గించేందుకు ఆర్బీఐ నిర్ణయం తీసుకుందని చెప్పవచ్చు.  ఇక అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్ర‌క‌టించిన  సుంకాల ప్ర‌భావం నేపథ్యంలో   దేశీయంగా వినియోగం, పెట్టుబ‌డుల సామర్థ్యం మందగించకుండా ఉండేందుకు కూడా ఆర్బీఐ వడ్డీ రేట్ల తగ్గింపు నిర్ణయం తీసుకుందని ఆర్థిక రంగ నిపుణులు చెబుతున్నారు.  

Teluguone gnews banner