ఫోన్ ట్యాపింగ్ కేసు.. సిట్ విచారణకు ఆరామస్తాన్

Publish Date:Dec 26, 2025

తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనంగా మారిన  ఫోన్ ట్యాపింగ్ కేసు  దర్యాప్తులో  భాగంగా సిట్ ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు ఆరా మస్తాన్ ను   విచారించింది. ఆరా పోల్ స్ట్రాటజీస్ సంస్థ వ్యవస్థా పకుడు ఆరా మస్తాన్‌ను  జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో  హైదరాబాద్ సీపీ సజ్జనార్ నేతృత్వంలో ఏర్పాటైన నూతన సిట్ శుక్రవారం విచారించింది. ఈ విచారణలో కీలక అంశాలను రాబట్టినట్లు విశ్వసనీయ సమాచారం. ఆరా మస్తాన్ కు పోలీసులు ఇప్పటికే రెండు సార్లు విచారించారు. తాజాగా సిట్ విచారణలో అధికారులు ఆయన గతంలో ఇచ్చిన వాంగ్మూలాల కన్ఫర్మేషన్ కోసం ప్రశ్నించినట్లు తెలుస్తోంది.    ఆరా మస్తాన్ గత కొన్నేళ్లుగా   రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు, ఇతర ప్రముఖులతో మాట్లాడిన ఫోన్ కాల్స్ రికార్డింగ్స్‌ను సమగ్రంగా పరిశీలించారు. ఈ కాల్ డేటా ఆధారంగా ఫోన్ ట్యాపింగ్ జరిగిందా?  లేదా? ఒక వేళ జరిగితే అందుకు ఎవరు ఆదేశించారు? అన్న అంశాలపై ప్రధానంగా దృష్టి సారించారు.  సిట్ విచారణ అనంతరం బయటకు వచ్చిన ఆరా మస్తాన్ మీడియాతో మాట్లాడారు.  నూతన సిట్   ఆదేశాల మేరకే  తాను విచారణకు హాజరయ్యానన్న ఆరా మస్తాన్.. గతంలో పోలీసులు అడిగన ప్రశ్న లనే మళ్లీ అడిగారని చెప్పారు.  2020 నుంచే తన ఫోన్ ట్యాప్ అవుతోందన్న అనుమానం ఉందనీ, ఇదే విషయాన్ని సిట్ అధికారుల చేప్పానన్నారు. నూతనంగా ఏర్పాటు చేసిన సిట్ పోన్ ట్యాపింగ్ కేసు  దర్యాప్తును వేగవంతం చేసిందన్న ఆరా మస్తాన్..  నూతన సిట్ ఆధ్వర్యంలో ఈ కేసుదర్యాప్తు మరింత సమగ్రంగా జరుగుతుందన్న నమ్మకం ఉందన్నారు.   

చట్టంతో గేమ్స్.. జగన్ కు అబ్బిన అనువంశిక విద్య!

Publish Date:Dec 26, 2025

చట్టం, న్యాయం, కోర్టులు ఇలాంటి వాటిని ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పెద్దగా ఖాతరు చేయరు. వాటితో చెలగాటమాడటం ఆయనకు రాజకీయ ప్రవేశానికి ముందు నుంచీ బాగా అలవాటైన విద్య. ఇదీ జగన్ గురించి న్యాయనిపుణులు చెప్పే మాట.  అందుకు వారు ఉదహరిస్తున్న ఈ క్రోనాలజీ చూస్తే ఎవరికైనా అది నిజమేగా అనిపించకమానదు.  జ‌గ‌న్ కి కోర్టుల‌ు, చ‌ట్టాలు, న్యాయ వంటి వాటిని లెక్క చేయని తనంఅన్నది కొట్టిన పిండి.  చట్టం, న్యాయం, రాజ్యాంగం ఇలాంటి వాటితో సంబంధం లేకుండా చేయాల్సిందంతా చేసేసి,  ఆపై కేసులు నమోదై, కోర్టుకు వెడితే వాటితో ఎలా ఆడుకోవాలో జగన్ కంటే బాగా తెలిసినవారెవరూ ఉండకపోవచ్చచునం టారు పరిశీలకులు.  ఈ విషయంలో జగన్  తాత రాజారెడ్డి కాలం నుంచి వైఎస్ కుటుంబానికి అనువంశికంగా అబ్బిన విద్య అంటారు.   లా యునివ‌ర్శిటీ ఎలాగో.. అన్ లాయూనివ‌ర్శిటీ అనేది ఉండి ఉంటే ఆ వర్సిటీకి జ‌గ‌న్ ను  హెడ్ అయి ఉండేవారంటారు. ఇప్ప‌టి వ‌ర‌కూ జ‌గ‌న్ క్విడ్ ప్రోకో కేసుల్లో  చట్టంతో చెలగాటమాడుతున్న తీరు తెలిసిందే. విచారణ ముందుకు సాగకుండా వరుస డిశ్చార్జ్ పిటిషన్ లతో ఆయన కేసును సాగతీస్తున్న తీరు న్యాయ నిపుణులనే విస్మయపరుస్తోంది.  ఇటీవ‌ల  జ‌గ‌న్ కేసుల‌ను ప‌రిశీలిస్తున్న న్యాయ‌మూర్తి బ‌దిలీ అయ్యారు. ఆయన స్థానంలో మరో న్యాయమూర్తి వచ్చారు. జగన్ కేసులు విచారిస్తున్న న్యాయమూర్తి బదలీ అయితే ఏంటి అని అంతా అనుకోవచ్చు కానీ  కొత్తగా వచ్చిన న్యయమూర్తి జగన్ కేసులకు సంబంధించిన అప్ డేట్స్ అన్నీ పరిశీలించడానికి కొన్నేళ్లు పడుతుంది.  దీంతో క‌థ మ‌ళ్లీ మొద‌టికే వ‌స్తుంది. సరే బదలీ అనేది సాధారణం కదా అనుకోవచ్చు. కానీ జగన్ తన కేసుల విచారణ ముగింపు లేకుండా అలా కొక.. సాగుతూ ఉండటానికి పలు పద్ధతులు అవలంబిస్తుంటారు..  వాటిలో ఒకటే   డిశ్చార్జీ పిటిష‌న్ల వ‌ర‌ద పారించడం. ఇప్ప‌టి వ‌ర‌కూ జ‌గ‌న్ కేసులలో  130 డిశ్చార్జీ పిటిష‌న్లు దాఖలయ్యాయి. అలాగే విచారణపై స్టేలు కోరుతూ పిటిషన్ వేయడం. ఇలాంటి పిటిషన్ల విచారణ ద్వారా కేసు దర్యాప్తు ముందుకు సాగకుండా అడ్డుకోవడం, అలాగే  ఈ కేసుల విచారణకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరడం.   2019- 24 మ‌ధ్య సీఎంగా అధికారంలో ఉన్నందున, పాలనా పరమైన అడ్డంకులకు అవకాశం లేకుండా, తనకు కేసుల విచారణకు వ్యక్తిగత హాజరు నుంచిమినహాయింపు కావాలంటూ పిటిషన్ వేసి మినహాయింపు పొందిన జగన్.. ఇప్పుడు అధికారంలో లేకపోయినా, కేవలం పులివెందుల ఎమ్మెల్యే మాత్రమే అయినా.. తాను కోర్టుకు వస్తే.. జనం ఇబ్బందిపడేంతగా ట్రాఫిక్ జామ్ లు ఏర్పడతాయనీ, తన భద్రతకు ప్రభుత్వానికి భారీగా ఖర్చు అవుతుందంటూ కోర్టును మళ్లీ వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరారు. తాను చెప్పిన మాట వాస్తవమని  అందరూ నమ్మే విధంగా ఇటీవల ఆయన నాంపల్లి కోర్టుకు హాజరైనప్పుడు వైసీపీయులు చేసిన హంగామా జగన్ ప్లాన్ లో భాగమేనంటారు పరిశీలకులు.   ఒక సాధార‌ణ ఎంఎల్ఏగా ఉన్న జగన్ కు ఎలాంటి హైఎండ్ ప్రోటోకాల్ లేకున్నా ఉన్న‌ట్టు గా సృష్టించి.. కోర్టు విచారణకు తనకంటూ ఓ షెడ్యూల్ ఏర్పాటు చేసుకున్న ఘనత జగన్ కే చెల్లుతుందంటున్నారు.   తాను ఎప్పుడు కోర్టుకు హారైనా జనం ఇలా తండోపతండాలుగా తనను చూడటానికి వస్తారనీ, వారిని కంట్రోల్ చేయడం, శాంతి భద్రతల సమస్య ఉత్పన్నం కాకుండా ఏర్పాట్లు చేయడం ప్రభుత్వాలకు, పోలీసులకు తలకు మించి భారం అవుతుందన్న బిల్డప్ క్రియేట్ చేశారు. ఇప్పడు అదే చూపి మరో సారి కేసుల విచారణ నుంచి వ్యక్తిగత మినహాయింపు పొందినా ఆశ్చర్యం లేదంటున్నారు విశ్లేషకులు.  ఇన్ని రకాలుగా తనపై ఉన్న అక్రమాస్తుల కేసుల దర్యాప్తు ముందుకు సాగకుండా జాప్యం అయ్యేలా జగన్ మేనేజ్ చేయగలుగుతున్నారంటే దానికి చట్టంతో చెలగాటమని కాకుండా మరేమనాలని ప్రశ్నిస్తున్నారు. కేసు వాయిదాలు కోరడానికే జగన్ న్యాయవాదుల ఖర్చు కోట్ల రూపాయలు ఉంటుందని ఇటీవల కొన్ని గణాంకాలువెలుగులోకి వచ్చాయి.  లాతో గేమ్స్ ఆడుకోవ‌డం ఎలా అని ఒలింపిక్స్ లో పోటీ పెడితే.. జగన్ కు గోల్డ్ మెడల్ ఖాయమంటూ నెటిజనులు సెటైర్లు పేలుస్తున్నారు. చూడాలి మరి ఇంకెంత కాలం ఈ కేసుల విచారణను జగన్ తన స్టైల్ లో సాగదీస్తారో?  

మాట మార్చిన ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్

Publish Date:Aug 28, 2025

  ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో రాజకీయాల్లో ఉన్న వ్యక్తులు 75 ఏళ్లకు రిటైర్ అవ్వాలని వ్యాఖ్యానించిన ఆర్ఎస్ఎస్ చీఫ్ ఇవాళ మాట మార్చారు. 75 ఏళ్లకు రిటైర్ అవ్వాలని నేను ఎవరికీ చెప్పలేదు అన్నారు. 75 ఏళ్ల తర్వాత కూడా చురుగ్గా పనిచేసే శక్తి ఉందని ఆయన తెలిపారు.సంఘ్ ఎలా చెప్తే అలా నడుచుకుంటామని వెల్లడించారు. కేంద్రం, ఆర్‌ఎస్‌ఎస్‌ మధ్య ఎలాంటి విభేదాలు లేవని  ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌ స్పష్టం చేశారు.  . రాష్ట్రీయ స్వయం సేవక్‌  సంఘ్‌ వందేళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. కొన్ని విషయాల్లో అభిప్రాయ బేధాలు ఉండొచ్చు.. వివాదం కాదంటూ చెప్పుకొచ్చారు. దేశ ప్రయోజనాలే ఇద్దరి ప్రాధాన్యతగా పేర్కొన్న మోహన్‌ భగవత్‌..  బీజేపీ అధ్యక్షుడి ఎన్నికను ఆర్‌ఎస్‌ఎస్‌ శాసించదన్నారు. ‘మేం సలహా ఇవ్వగలం  .. తుది నిర్ణయం వారిదేని తెలిపారు.  నూతన విద్యా విధానానికి మేం మద్దతిస్తున్నాం. ఇంగ్లీష్‌ నేర్చుకోవడంలో తప్పులేదు’’ అంటూ ఆయన వ్యాఖ్యానించారు. బీజేపీ తరఫున ఆర్‌ఎస్‌ఎస్‌ నిర్ణయాలు తీసుకుంటుందని  ప్రతిపక్షాల నుండి వస్తున్న ఆరోపణలను ఆయన తోసిపుచ్చారు. కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్రాలతో తమకు మంచి సమన్వయం ఉందని మోహన్ భగవత్ వెల్లడించారు.  

ఈ రూల్స్ ఫాలో అయితే న్యూ ఇయర్ లో పిల్లల సక్సెస్ పక్కా..!

Publish Date:Dec 26, 2025

కొత్త అనే పదంలోనే బోలెడంత ఆశ ఉంటుంది.  ప్రతి ఒక్కరూ తమకు కొత్త అనే పదం నుండి ఎంతో గొప్ప మేలు జరుగుతుందని అనుకుంటారు.  అలా జరగాలని కూడా కోరుకుంటారు.  అందుకే రేపు అనే రోజు మీద కూడా చాలా ఆశ ఉంటుంది అందరికీ. ఇప్పుడైతే తొందరలోనే కొత్త ఏడాది రాబోతోంది.  క్యాలెండర్ తో పాటు తమ జీవితం కూడా మారాలని కొండంత ఆశ పెట్టుకుని ఉంటారు అందరూ. మరీ ముఖ్యంగా ప్రతి తల్లిదండ్రి తమ కంటే ఎక్కువగా తమ పిల్లల జీవితం గురించే ఆలోచిస్తారు.  తమ పిల్లలు సంతోషంగా ఉండాలని,  చదువులో, కెరీర్ లో విజయం సాధించాలని కోరుకుంటారు. చదువుకునే పిల్లల తల్లిదండ్రులు ఈ కొత్త ఏడాదిలో తమ పిల్లలు సక్సెస్ గా ముందుకు సాగాలని కోరుకుంటారు.  అయితే పిల్లలు కొత్త ఏడాదిలో సక్సెస్ కావాలన్నా, వారి భవిష్యత్తు మరెంతో గొప్పగా  ఉండాలన్నా  కొన్ని రూల్స్ ఫాలో అవ్వాలి.  అవేంటో తెలుసుకుంటే.. రీడింగ్.. చదవడం వల్ల పిల్లల ఊహ, భాష,  ఆలోచన అన్నీ బలపడతాయి. రోజూ చదివే పిల్లలకు మంచి జ్ఞాపకశక్తి, ఏకాగ్రత  పెరుగుతాయని పరిశోధనలు చెబుతున్నాయి. కొత్త సంవత్సరం నుండి రోజుకు కనీసం 30 నిమిషాలు రీడింగ్ అలవాటు చేసుకోవాలని పిల్లలకు చెప్పాలి.  ఇందుకోసం ఏదైనా చదవవచ్చు.  కథ, కామిక్ లేదా ఏదైనా ఇన్ఫర్మేషన్  అందించే పుస్తకం.. ఇలా ఏవైనా ఎంచుకోవచ్చు. స్క్రీన్ సమయం.. కొత్త సంవత్సరంలో పిల్లలు  ఫోన్‌కు దూరంగా ఉండటం అలవాటు చేయాలి. పగటిపూట  నిర్ణీత  సమయం కంటే ఎక్కువసేపు స్క్రీన్‌లను చూడటం వల్ల నిద్ర,  కంటి చూపు దెబ్బతింటుంది. పడుకునే గంట ముందు  మొబైల్ ఫోన్‌ను దూరంగా ఉండటం  కూడా చాలా ముఖ్యం. నిద్ర..  ప్రతి పిల్లవాడు తప్పనిసరిగా ఫాలో కావల్సిన మంచి అలవాటు ఏంటంటే..  సరైన సమయానికి  పడుకుని, సరైన సమయానికి మేల్కోవడం. పిల్లల మానసిక అభివృద్ధికి చదువు ఎంత ముఖ్యమో నిద్ర కూడా అంతే ముఖ్యం. కాబట్టి రాత్రి సరైన సమయానికి పడుకుని, ఉదయాన్నే నిద్రలేచే అలవాటు తప్పనిసరిగా ఫాలో అవ్వాలి. నేర్చుకోవడం.. నేర్చుకునే అలవాటు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుంది. ఇది పిల్లలను పోటీ ప్రపంచానికి సిద్ధం చేస్తుంది. పిల్లలు కొత్త పదజాలం, చిత్రలేఖనం, సంగీతం లేదా క్రీడలు ఏదైనా కొత్తగా నేర్చుకుంటూనే ఉండాలి. ఇందుకోసం తల్లిదండ్రులు పిల్లలకు చాలా సహకారం అందించాలి. నడవడిక.. ఎవరికైనా సరే ధాంక్స్  చెప్పడం, పెద్దలను గౌరవించడం,  సహాయం చేయడం వంటివి వ్యక్తిత్వాన్ని బిల్డ్ చేసే  అలవాట్లు. ఇతరులను గౌరవించడం, మంచి మర్యాదలను అలవర్చుకోవడం చేయాలి. ఆహారం.. పిల్లల ఆరోగ్యం పట్ల మరింత జాగ్రత్త తీసుకోవడం తప్పనిసిరి.  జంక్ ఫుడ్ కు దూరంగా ఉండాలి.   జంక్ ఫుడ్ కు బదులుగా పండ్లు, కూరగాయలు,  ఇంట్లో వండిన ఆహారాన్నితీసుకోవాలి. పిల్లల రోగనిరోధక శక్తి,  పెరుగుదలకు మంచి ఆహారపు అలవాట్లు చాలా అవసరం. వ్యాయామం.. ఆటలు..  పిల్లలను ఆరోగ్యంగా ఉంచడంలో వ్యాయామం, ఆటలు చాలా బాగా సహాయపడతాయి. పిల్లలను బయటకు వెళ్లి ఆడుకోవడం ప్రోత్సహించాలి.  ఇది  పిల్లలను సామాజికంగా కలిసిపోయేలా చేస్తుంది.  ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం పిల్లలకు ప్రతిరోజూ కనీసం 60 నిమిషాల శారీరక శ్రమ అవసరం. అందువల్ల పిల్లలు తమ శారీరక వ్యాయామాన్ని,  బయటకు వెళ్లి తోటి పిల్లలతో ఆడుకోవడాన్ని ప్రోత్సహించాలి.  దీనికి తల్లిదండ్రులు కూడా సహకరించాలి.                                    *రూపశ్రీ.
[

Health

]

గ్యాస్ సమస్యను పెంచే స్నాక్స్.. సాయంత్రం 6గంటల తర్వాత వీటిని అస్సలు తినకూడదు..!

Publish Date:Dec 26, 2025

సాయంత్రం అనగానే పనులన్నీ ముగించుకుని హాయిగా ఇంట్లో కూర్చుని కాఫీ, టీ, పాలు.. లాంటి పానీయాలు తాగుతూ ఎంచక్కా  ఏవైనా స్నాక్స్ తినడం గుర్తు వస్తుంది అందరికీ.  అవకాశం దొరకాలే కానీ ప్రతి ఒక్కరూ ఇంట్లో కూర్చుని సాయంత్రం స్నాక్స్ ఎంజాయ్ చేయాలని అనుకుంటారు. ఇంట్లో కుదరక పోతే కనీసం బయట అయినా స్నాక్స్ లాగించేవారు ఉంటారు. అయితే కొన్ని రకాల స్నాక్స్ ను సాయంత్రం 6గంటల తర్వాత అస్సలు తినవద్దని చెబుతున్నారు ఆహార నిపుణులు.  దీని వల్ల గ్యాస్ సమస్య ఎక్కువ అవుతుందని,  రాత్రంతా గ్యాస్ సమస్యతో ఇబ్బంది పడుతూ ఉండాల్సిందే అని అంటున్నారు. ఇంతకీ సాయంత్రం 6 గంటల తర్వాత తినకూడని స్నాక్స్ ఏంటో తెలుసుకుంటే.. సాయంత్రం 6 గంటల తర్వాత కొన్ని స్నాక్స్ తినకూడదని గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్లు చెబుతున్నారు.  సమోసాలు, జిలేబీలు, పానీపురి, వడ పావ్, కచోరీలు, వేయించిన మోమోలు,  నామ్కీన్‌లను సాయంత్రం 6 గంటల తర్వాత తినకూడదట. ఎక్కువ బటర్ తో కూడిన  బర్గర్‌లు, పావ్ భాజీలు కూడా సాయంత్రం 6 తరువాత తినకూడదని అంటున్నారు. పైన చెప్పుకున్న  ఆహారాలను అప్పుడప్పుడు తినడం వల్ల ఏమీ కాదని అనుకుంటారు. కానీ అప్పుడ్పుడు తినడం అనేది అలవాటు అయితే చాలా కష్టమట.  ఈ అలవాటు శరీరానికి ఎక్కువ కేలరీలు, కొవ్వు,  చక్కెరను ఇస్తాయి. ఇది బరువు పెరగడం, గ్యాస్, ఎసిడిటీ,  రక్తంలో  చక్కెర స్థాయిలు పెరగడం వంటి సమస్యలకు దారితీస్తుంది. వేయించిన ఆహారాలు,  టైప్ 2 డయాబెటిస్ మధ్య సంబంధం ఉందని కొన్ని పరిశోధనలు చెబుతున్నాయి. వేయించిన ఆహారాలు తినేవారిలో రక్తంలో చక్కెర నియంత్రణ తక్కువగా ఉంటుంది.  ఇన్సులిన్ నిరోధకత కూడా పెరిగే ప్రమాదం ఉంది. వేయించిన ఆహారాలు పేగు ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి. మంచి బ్యాక్టీరియాను తగ్గిస్తాయి, వాపును పెంచుతాయి.   ఆకలిని, షుగర్ క్రేవింగ్స్ ను నియంత్రించే హార్మోన్లు కూడా తగ్గుతాయి.  దీని వల్ల వీటిని పదేపదే తినాలని అనిపిస్తుంది. ఇది బరువు పెరగడానికి కూడా కారణం అవుతుందట. కాబట్టి  పైన పేర్కొన్న ఆహారాలను అప్పుడప్పుడు తినడం కూడా కాస్త ఇబ్బందే. అలాగే కొన్ని ఆహారాలను 6 గంటల తర్వాత అస్సలు తినకూడదు కూడా.                              *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...