గాలి పెళ్లిని మించిన పెళ్లి.. కాంగ్రెస్ నోటికి మూత...
posted on Nov 22, 2016 @ 11:34AM
మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డి కుమార్తె వివాహం ఈనెల 16వ తేదీన జరిగిన సంగతి తెలిసిందే. ఇక గాలి జనార్ధన్ కూతురి పెళ్లి అంటే మామూలుగా జరుగుతుందా..పెళ్లికి పిలిచే ఆహ్వాన పత్రికను చూసినప్పుడే అందరికి ఈ పెళ్లి ఏ రేంజ్ లో జరుగుతుందో. కొన్ని వందల కోట్లు రూపాయలు ఖర్చు పెళ్లి గాలి తన కూతురి పెళ్లిని అంగరంగ వైభవంగా చేశాడు. పెద్ద నోట్ల రద్దుతో దేశమంతటా ప్రజలు నానా కష్టాలు పడుతున్నా.. గాలి గారికి మాత్రం ఎలాంటి డబ్బు బాధ లేకుండా పెళ్లి జరిపించారు. ఇక పెళ్లి నాడు దేశ వ్యాప్తంగా ప్రజలు పెళ్లి తంతును చూడటానికి టీవీలకు అతుక్కుపోయారని చెప్పడంతో అతిశయోక్తి లేదు. ఇదిలా ఉంటే ఇప్పుడు హాట్ టాపిక్ ఏంటంటే... గాలి జనార్థన్ కూతురి పెళ్లిని మించిన పెళ్లి కర్ణాటకలో జరగబోతుందట. ఇంతకీ ఆ పెళ్లి ఎవరిదనుకుంటున్నారా.. కాంగ్రెస్ నేత, రాష్ట్ర చిన్నతరహా పరిశ్రమల మంత్రి రమేష్ జర్కిహొలి కుమారుడి పెళ్లి. ఈ పెళ్లి గోకక్ పట్టణంలో ఆదివారం నాడు జరగబోతుంది. ఇక ఈ పెళ్లి ఏర్పాట్లు వింటే ఆశ్చర్యపోవాల్సిందే. అవి ఏంటంటే.. ఈ పెళ్లి కోసం కేవలం కల్యాణ్ మంటపాన్నే రెండు ఎకరాల్లో నిర్మిస్తున్నారట. అంతేకాదు.. కొల్హాపూర్ లోని మహాలక్ష్మి ఆలయం మాదిరి పెళ్లి మంటపాన్ని ఏర్పాటు చేస్తున్నారు. పెళ్లి మండపం అంతా ఎయిర్ కండిషన్డే. పట్టణ శివార్లలో వీవీఐపీల హెలికాప్టర్ల కోసం హెలిప్యాడ్లు నిర్మిస్తున్నారు. ఈ పెళ్లికి కాంగ్రెస్ పార్టీకి చెందిన అగ్రనేతలు హాజరవుతారని సమాచారం. భారీ సంఖ్యలో ప్రముఖులు తరలివస్తారని అంచనా వేస్తున్నారు. లక్షమందికి పైగా పెళ్లికి హాజరవుతున్నట్టు తెలుస్తోంది.
మరి గాలి జనార్ధన్ రెడ్డి తన కూతురి పెళ్లి ఇంత ఖర్చు చేయడంపై ప్రతిపక్షాలు నానా హంగామా చేశాయి. అంతేకాదు బీజేపీ పార్టీ గాలికి కొమ్ముకాస్తోందని ఆరోపించాయి. దీనికో తోటు ఇంత డబ్బు ఎక్కడినుండి వచ్చిందన్న నేపథ్యంలో నిన్న ఆయన మైనింగ్ కంపెనీలపై ఐటీ దాడులు కూడా జరిపాయి. మరి ఇప్పుడు కాంగ్రెస్ నేతలు తమ నేత ఇంటి పెళ్లి గురించి ఎలా స్పందిస్తారో చూద్దాం...