పుట్టపర్తి లో అధ్బుతం
posted on Apr 19, 2011 @ 12:00PM
అనతపురం: పుట్టపర్తి సత్యసాయి బాబా విగ్రహం పాదాల నుంచి సుగంధ ద్రవ్యాలు వెలువడుతున్నాయి. మంగళవారం పుట్టపర్తిలో ఈ అద్భుతం జరిగింది. ఎనుముల పల్లె తహసీల్దార్ నారాయణస్వామి నివాసంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. పుట్టపర్తిలో రహీమ్ అనే వ్యక్తి ఐదు నెలల క్రితం ఓ సత్యసాయి విగ్రహాన్ని తయారు చేశారు. దీని బరువు సుమారు 120 కిలోలు ఉంటుంది. అయితే అనుకోకుండా ఈ రోజు ఉదయం తొమ్మిది గంటల ప్రాంతం నుండి బాబా పాదాల వద్ద నుండి సెంటు ద్రవపదార్థంగా కారుతోంది. సత్యసాయిబాబా విగ్రహం పాదాల నుంచి సుగంధ ద్రవ్యాల నూనె కారుతున్న అద్భుతాన్ని తిలకించేందుకు భారీ స్థాయిలో భక్తులు, మహిళలు పుట్టపర్తికి చేరుకుంటున్నారు. సత్యసాయి విగ్రహం పాదాల నుంచి కారిన నూనెతో ఆ గది పూర్తి నూనెమయం అయ్యింది. ఇదంతా బాబా మహిమేనని భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. బాబా ఆరోగ్య పరిస్థితిపై భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో, త్వరలో కోలుకుని మీకు అండగా ఉంటాననే సందేశాన్ని తెలియజేసేందుకే ఇలాంటి అద్భుతం జరిగిందని భక్తులు నమ్ముతున్నారు.