కిరణ్ సర్కార్‌కు ముప్పుగా మారిన పవర్ కట్స్
posted on Jul 12, 2012 @ 12:47PM
ప్రభుత్యానికి ముందుచూపు లేక రాష్ట్రం అంధకారంలోకి వెళ్లిపోయింది. చంద్రబాబునాయుడు రాష్ట్రాన్ని స్వర్ణాంద్రప్రదేశ్ గాను, దివంగత ముఖ్యమంత్రి హరితాంద్రప్రదేశ్‌గాను మార్చాలని ఎంతగానో ప్రయత్నించారు. అయితే ఇప్పుడున్న కిరణ్‌కుమార్ ప్రభుత్వం మాత్రం రాష్ట్రాన్ని అంధకారాంద్రప్రదేశ్ గా మార్చింది. మన రాష్ట్రానికి 11,352 మెగావాట్ల విద్యుత్ అవసరం వుండగా 90142 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి మాత్రమే అవుతుంది. మహారాష్ట్ర, కర్ణాటక ప్రభుత్వాలు అడ్డగోలుగా గోదావరి , కృష్ణాజలకు అడ్డుగా ప్రాజెక్టులు కట్టి రాష్ట్రంలోకి జలాలను రాకుండా అడ్డుకున్నారు. దీనికి తోడు వర్షాభావ పరిస్థుతులతో జలాశయాలు నిండుకోవండటంతో జల విద్యుత్ తగ్గిపోయింది.
మన రాష్ట్రంలో ఉన్న బొగ్గు ఆధారిత పవర్ ప్లాంటులన్నీ ఎప్పటివో కాబట్టి వాటి రిపేర్లకే ఎక్కువ సమయం కేటాయించ వలసివస్తుంది. దాంతో రాష్ట్రంలో 8 ధర్మల్ విద్యుత్ కేంద్రాలన్నుప్పటికి అవసరాలకు సరిపడా విద్యుత్‌ను ఉత్పత్తి చేయటంలో వెనుకబడిపోయాం. రిలయన్స్, గుజరాత్ గ్యాస్ సంస్థలు వారి రాష్ట్ర ప్రయోజనాలకే ఎక్కువ ప్రాముఖ్యల నిస్తూ మన రాష్ట్రవాటాగా రావలసిన భాగాన్ని రాకుండా చేస్తున్నాయి దీంతో . గ్యాస్ ఆధారిత విద్యుత్ కేంద్రాలకు గ్యాస్ సరఫరా సరిగా లేనంనదున విద్యుత్ ఉత్పత్తి మరింత తగ్గింది. ప్రభుత్వ మెతకవైఖరే దీనికి కారణంగా చెప్పుకోవచ్చు. అధికారుల ముందుచూపులేకుండా ఇప్పుడు ఏకంగా కోతలు విధించడం విడ్డూరం. ఇదే పరిస్థితి కొనసాగితే రాష్ట్రంలో కాంగ్రెస్ పరిపాలన మరింత కష్టాలను ఎదుర్కోవలసివస్తుంది. ఇప్పటికే కరెంటు కోతలవల్ల పరిశ్రమలు మూత పడ్డాయి. కార్మికులు దీంతో విపత్కర పరిస్థితులకు లోనవుతున్నారు. ఒకప్ఫుడు పరిశ్రమలు పెడతామని బారులు తీరిన పారిశ్రామిక వేత్తలంతా రాష్ట్రాన్ని వదిలి పోయారు.
పల్లెల్లో రాత్రి 6నుండి ఉదయం 6వరకు కరెంటు లేక పోవడంతో రాత్రిపూట దోమలకు బలై ప్రజలు మలేరియా, ఫైలేరియా వంటి రోగాలు పడిన పడి ఆసుపత్రులకు సమయాన్ని , ధనాన్ని వ్యయపరచవలసి వస్తుంది. డిల్లీ హైదరాబాదుకు రాష్ట్ర ి నాయకులు ఎన్ని సార్లు తిరిగినా ఎవ్వరూ కరెంటు సమస్యపై కేంద్రాన్ని సహాయం కోరడం జరగటం లేదు. స్వప్రయోజనాలకే ప్రాముఖ్యత నిస్తూ, ప్రజలగురించి ఆలోచించడం మానేశారు. గడచిన మూడు సంవత్సరాలనుండి సరైన నాయకత్వంలేని కారణంగా ఆంద్రప్రదేశ్ అన్ని రంగాలలోనూ విపరీత మైన నిర్లక్ష్యానికి గురైందనటానికి ఇదొక ఉదాహరణ. దీనివల్ల పల్లె ప్రాంతాలలో నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడుతుంది.హాస్పటల్ సేవలకు ప్రమాదం వాటిల్లుంతుంది. ప్రజారంజక ప్రభుత్వాలు కానందుకే ఇలాంటి పరిస్ధితులు దాపురించాయని ప్రజలు వాపోతున్నారు. రానున్న ఉపద్రవాన్ని పసిగట్టి ప్రత్యామ్నాయ యత్నాలుగా పవన విద్యుత్‌ను, సోలార్ ఎనర్జీని ప్రమోట్ చేయటం జరగలేదు. ప్రతిపక్షాలు దీన్ని ఒక అస్త్రంగా వాడుకుంటున్నాయే తప్ప ప్రజలకు ఒరగబెట్టిందేమీ లేదు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పేరులోనే కిరణాలు గాని, రాష్ట్రం మొత్తం కటిక చీకటే. విద్యుత్ సమస్య కిరణ్ ప్రభుత్వ ప్రతిష్టను దారుణంగా దెబ్బతీస్తోంది. అయినా ఆయన ఏమి చేయలేని నిస్సహాయ స్దితిలో ఉన్నారు.