పోచారం రాజీనామా ఆమోదం
posted on Apr 28, 2011 @ 12:35PM
హైదరాబాద్: నిజామాబాద్ జిల్లా బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస రెడ్డి తన శాసనసభ సభ్యత్వానికి చేసిన రాజీనామాను డిప్యూటీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ ఆమోదించారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన పోచారం శ్రీనివాసరెడ్డిని శాసనసభ సభ్యత్వానికి అనర్హుడిగా ప్రకటించాలంటూ తెలుగుదేశం పార్టీ దాఖలు చేసిన పిటిషన్‌ను ఆయన కొట్టిపారేశారు. పోచారం తన శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేసినందున అనర్హునిగా ప్రకటించాల్సిన అవసరం లేదని నాదెండ్ల మనోహర్ అభిప్రాయపడినట్టు సమాచారం. తెలంగాణ విషయంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా ఆయన తెదేపాకు పార్టీకి రాజీనామా చేశారు. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర సమితి తీర్థం పుచ్చుకున్నారు. తెరాసలో చేరిన తర్వాత శాసనసభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు. ఆ తర్వాత ఎమ్మెల్యేల కోటా కింద జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆయన క్రాస్ ఓటింగ్‌కు పాల్పడ్డారు. దీంతో పోచారంపై అనర్హత వేటు వేయాలని తెదేపా డిప్యూటీ స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు.