పెంపులతో సామాన్యుడి (ఇం)ధనం ఆవిరి!
posted on Sep 12, 2012 @ 10:24AM
ఇంధన ధరల పెంపు ప్రతిపాదన వచ్చే వారానికి వాయిదా పడింది. పెట్రోల్‌తో సహా ఇతర ఇంధన ధరలను తక్షణమే పెంచే ఆలోచనైతే లేదని కేంద్ర చమురుశాఖా మంత్రి స్పష్టం చేశారు. ఆయనే సామాన్యులపై పెనుభారం మోపే ఇంధన ధరల పెంపు బాధాకరమైన నిర్ణయమైనప్పటికి తీసుకోక తప్పదని కూడా ఆయన సెలవిచ్చారు. ‘అహా! ఆయనకు సామాన్య ప్రజలపై ఎంత ప్రేమ. ఒకవారంరోజుల పాటు ధరలు పెంచకుండా వాయిదా వేసి ఎంత గొప్ప నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ నియంత్రిత ధరలకు డీజిల్, ఎల్‌పిజి, కిరోసిన్ విక్రయించడంతో ఐఓసి, హెచ్‌పిసిఎల్, బిపిసిఎల్ సంస్థలు రోజుకు రూ.560 కోట్లు నష్టపోతున్నాయి. సబ్సిడీ ధరలకు విక్రయించడం వల్ల లీటర్ డీజిల్‌పై రూ19.28, కిరోసిన్‌పై రూ.34.34, ఇంట్లో వాడుకునే వంటగ్యాస్ సిలిండర్ ఒక్కింటికి రూ. 347 నష్టం చవిచూడాల్సి వస్తుందని కంపెనీలు చెబుతున్నాయి. పెట్రోల్‌పై నియంత్రణ ఎత్తివేసినప్పటికి పార్లమెంట్ సమావేశాలు కొనసాగడంతో ధర పెంచడానికి కేంద్ర ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు అనుమతివ్వలేదు. అంటూ చెప్పుకొచ్చారు. వాయిదాపడే కొద్దీ పెంపుకూడా పెరుగుతుంటుంది. ఏతావాతా చెప్పేదేంటయ్యా అంటే ` మోటారు బండ్ల కంటే ఎడ్లబండ్లే శ్రేయస్కరమని! ఇది చాణ్యుకునికి సైతం అందని రాజనీతి.