జేఎన్‌టీయూ కాదు జేఎన్‌యూ... ఫాలోవర్లకు పవన్ సారీ...
posted on Dec 17, 2016 @ 3:40PM
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ట్విట్టర్ ద్వారా బీజేపీపై పరోక్షంగా విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే గోవధ, రోహిత్ వేముల ఆత్మహత్య పై పలు ప్రశ్నలు సంధించిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు మరో అంశంపై ప్రశ్నించిన సంగతి విదితమే. ఈ సందర్భంగా ఆయన ‘జేఎన్‌టీయూలో విద్యార్థులపై దేశ ద్రోహం పెట్టారు, కానీ, వారు దేశ ద్రోహానికి పాల్పడలేదు.. తరువాత ఆ విషయం రుజువైంది’ అని పేర్కొన్నారు. అయితే తరువాత మరికొద్ది సేపటికి తాను తన ట్వీట్‌లో జేఎన్‌టీయూ అని పేర్కొన్నానని, దాన్ని సరిచేస్తున్నానని అది ‘జేఎన్‌టీయూ కాదు- ఢిల్లీలోని జేఎన్‌యూ’ అని తన ఫాలోవర్లకు సారీ చెప్పారు. రేపు తాను ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై పోస్ట్ చేస్తానని చెప్పారు. ఆఖరికి జై హింద్ అని పేర్కొన్నారు.
కాగా దేశం ద్రోహంపై పవన్ కళ్యాణ్ ట్వీట్ చేసిన సంగతి విదితమే. 'ప్రజాస్వామ్యంలో అధికార పార్టీ అభిప్రాయంతోగానీ, విధానంతోగానీ విభేదిస్తే.. వారిని దేశద్రోహులుగా ముద్ర వేయకూడదు. ఇకవేళ వారు తమ ప్రత్యర్థుల గురించి తీవ్ర అభిప్రాయాలు వెల్లడించినా.. వారి గొంతును నులిమివేయకుండా మొదట వారు చెప్పేది వినాలి. ఆ తర్వాత అవసరమైన చర్యలు తీసుకోవాలి. అలాకాకుండా హడావిడిగా చర్యలు తీసుకుంటే జేఎన్‌యూ విద్యార్థులపై 'దేశద్రోహం' కేసు మాదిరిగానే ఎదురుదెబ్బ తగిలే అవకాశముంటుంది. జేఎన్‌యూ విద్యార్థుల కేసులో చివరకు వారి వీడియో కావాలని మార్చినట్టు తేలింది' అని అన్నారు.