రోహిత్ వేముల ఆత్మహత్యపై పవన్ కళ్యాణ్.. బీజేపీకి వ్యతిరేకంగా..
posted on Dec 16, 2016 @ 3:50PM
హెచ్‌సీయూ విద్యార్థి రోహిత్ వేముల సూసైడ్ చేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ విషయం అప్పట్లో పెద్ద దుమారమే రేగింది. అంతేకాదు ఈ విషయాన్ని కొంతమంది రాజకీయ నాయకులు రాజకీయంగా కూడా బాగానే ఉపయోగించుకున్నారు. అది గతకొద్ది రోజులుగా ఈ విషయం గురించి ఎక్కడా చర్చలులేవు. దాదాపు అందరూ మర్చిపోయారు. అయితే ఇప్పుడు దీనిపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించి.. మరోసారి ఈ వ్యవహారాన్ని తెరపైకి తీసుకొచ్చారు. పవన్ కళ్యాణ్ అప్పుడప్పుడు ట్విట్టర్ ఖాతా తన అభిప్రాయాలు వెల్లడిస్తారు. నిన్న గోవధ గురించి పలు ప్రశ్నలు సంధించిన ఆయన ఈరోజు రోహిత్ వేముల ఆత్మహత్య అంశంపై ట్విట్టర్‌లో స్పందించి.. తన అభిప్రాయాలను వెల్లడించారు.
* రోహిత్ వేములకు క్యాంపస్ నుంచి సస్పెన్షన్‌తో పాటు వెలివేత శిక్ష పడింది. అదే అతడిని ఆత్మహత్యకు పురికొల్పింది. తన వర్గంనుంచి అవసరమైన నైతిక బలం లభించకపోవడం కూడా అందుకు మరో కారణమైంది.
* రోహిత్ వేముల ఆత్మహత్యలో అత్యంత విచారకరమైన అంశం భాజపా వ్యతిరేక పార్టీలన్నీ దాన్ని రాజకీయం చేయడం. వారంతా తమకు అనుకూలంగా దానిని మలచుకుంటే మరోవైపు భాజపా, మిత్రపక్షాలు ఆయన దళితుడు కాదని నిరూపించడంలో నిమగ్నమయ్యాయి. కానీ అందరూ ఒక ప్రశ్నను మాత్రం మర్చిపోయారు.. భవిష్యత్తులో యువత ఇలా నిరాశా నిస్పృహలతో ప్రాణాలు తీసుకోకుండా చూడాలంటే ఏం చేయాలనే విషయాన్ని వారు విస్మరించారు.
* ఎప్పటికైనా మన యూనివర్శిటీలు విద్యా వేదికలుగా నిలుస్తాయని.. రాజకీయ పార్టీలకు యుద్ధభూములు కావని ఆశిస్తాను.
ఇంకా దేశభక్తి, పెద్దనోట్ల రద్దు, ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదాల పై కూడా ఆయన ప్రశ్నించారు. మొత్తానికి పవన్ కళ్యాణ్ బీజేపీని వ్యతిరేకిస్తున్నట్టు తెలుస్తోంది.