తరుమల కొండపైకి సొంత వాహనాలతో నో ఎంట్రీ
posted on Sep 25, 2022 @ 9:41AM
తిరుమల శ్రీవెంకటేశ్వరస్వామి వారి బ్రహ్మోత్సవాలకు సోమవారం(సెప్టెంబర్ 26) అంకురార్పణ జరగనుంది. గత రెండు సంవత్సరాలుగా కరోనా కారణంగా బ్రహ్మోత్సవాలకు భక్తులను అనుమతించని సంగతి తదెలిసిందే. దీంతో ఈ ఏడు తిరుమల బ్రహ్మోత్సవాలకు భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తారన్న అంచనాతో టీటీడీ పటిష్ట ఏర్పాట్లు చేసింది.
శ్రీవారి బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల దర్శనాన్ని రద్దుచేయడం, వీవీఐపీలు, వీఐపీ దర్శనంలోనూ పరిమితులు విధించడం వంటి నిర్ణయాలు తీసుకుంది. అలాగే తిరుమలకు వచ్చే భక్తులు ఎక్కువ మంది సొంత వాహనాల్లో వచ్చే అవకాశం ఉంది. దీంతో కొండపైకి సొంత వాహనాలలో వచ్చే వారి విషయంలోనూ ఆంక్షలు విధించింది.
భక్తులు కొండపైకి ద్విచక్రవాహనాల్లో రావడానికి అనుమతించరాదని నిర్ణయించింది. బ్రహ్మోత్సవాలు పూర్తయ్యేంత వరకూ కొండపైకి ద్విచక్రవాహనాలను అనమతించబోమని టీటీడీ స్పషం చేసింది. అలాగే కార్లలో వచ్చే వారి విషయంలో కూడా పరిమితులు విధించింది. రోజుకు 12 వేల కార్లకు మాత్రమే కొండపైకి వెళ్లేందుకు అవకాశం ఉంటుందనీ, ఆ సంఖ్య దాటితే ఎవరైనా సరే తమల వాహనాలను తిరుపతిలోనే టీటీడీ ఏర్పాటు చేసిన పార్కింగ్ స్థలాలలో పార్క చేసి ఆర్టీసీ బస్సుల్లో మాత్రమే కొండపైకి వెళ్లాలన్న నిబంధన విధించింది. ఈ ఆంక్షలు బ్రహ్మోత్స వాలు జరిగే తొమ్మది రోజులూ అమలులో ఉంటాయి.