సర్వేలతో నాగం బిజీ బిజీ
posted on Jul 19, 2012 @ 4:06PM
తెలంగాణ వాదంతో అదరగొట్టే నాగం జనార్ధన్‌రెడ్డి ఇటీవల పత్రికా సమావేశాల్లో, సభల్లో కనబడక పోవడానికి కారణం ఏమైవుంటుందా అని ఆరా తీస్తే ఆయన బిజీ బిజీగా సర్వేలు జరుపుతున్నారని తెలిసింది. దేని నిమిత్తం అనుకుంటున్నారు...తెలంగాణా ఏ ఏ అంశాల్లో వెనుకబడివుందో తెలుసుకుంటున్నారట. అందుకోసమే అన్ని రంగాలలోనూ సర్వేలు జరిపిస్తున్నారట. ప్రతి ప్రభుత్వ కార్యాలయాలను దర్శించి వారు చెప్పిన వివరాలను నోట్‌చేసుకుంటున్నారట. ప్రవేటు సంస్ధలనుకుడా వదలటం లేదని తెలిసింది.
ఆంధ్రావాళ్లు ఎంత ముందున్నారు తెలంగాణవాళ్లు ఎంతగా వెనుకబడ్డారో ఇక సర్వేరిపోర్టుల ఆధారంగా చెప్పనున్నారు. దీనివల్ల రానున్న ఎన్నికల్లో నాగం తెలంగాణవాదుల్ని మెప్పిస్తారని తెలుస్తుంది. తెలంగాణా ఉద్యమనాయకుడిగా కేసిఆర్ ప్రస్తుత స్ధాయికి ఎదగడానికి ఆయన చేస్తున్న ప్రసంగాలే. గణాంకాలతో ఆయన ఆలోచన రేకెత్తించేవిధంగా పదుదనైన ప్రసంగాలు చేస్తారు. నాగం జనార్ధన రెడ్డి కూడా కేసిఆర్ బాటలోనే పయనించడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. ఇప్పటికే ఏ విషయంపైనైనా అనర్గళంగా ప్రసంగించగల నాగం జనార్దన్ రెడ్డి ఇక ముందు తన వాడి వేడి ప్రసంగాలకు గణాంకాలు జోడిరచి అదరగొట్టనున్నారు. సో ఆంధ్రా నాయకులు రెడీగా వుండండి.