రోష్ట్రంలో మంత్రులైనా లంచం ఇవ్వాల్సిందే
posted on Jun 27, 2012 @ 11:50AM
మంత్రి వర్గ సహచరి నుంచే రూ. 25 కోట్ల లంచం డిమాండ్ చేస్తున్న జూనియర్ మంత్రి రాష్ట్రం అవినీతితో కంపుకొడుతోంది. కొందరు మంత్రులు బరితెగించి దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న ఉద్దేశ్యంతో అందిన కాడికి దోచుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఇటీవలె మంత్రి పదవి పొందిన ఒక వ్యక్తి సహచర సీనియర్ మంత్రి పార్టనర్‌గా ఉన్న ప్రాజెక్టుకు సంబంధించిన ఫైల్ క్లియరెన్స్ కోసం అక్షరాలా రూ.25 కోట్ల రూపాయలు డిమాండ్ చేస్తున్నట్లు తెలిసింది. వందలాది కోట్ల విలువైన ఈ ప్రాజెక్టు ఫైనల్ స్టేజ్‌లో ఉన్న సమయంలో సంబంధిత శాఖ మంత్రి ఆ సీనియర్ మంత్రి పార్టనర్స్ నుంచి డబ్బు డిమాండ్ చేస్తుండడంతో సీనియర్ మంత్రి ఒక దశలో తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు.ఈ ప్రాజెక్టులో తనకు వాటా ఉన్న సంగతి చెప్పి ఫైల్ క్లియర్ చేయించాలని సీనియర్ మంత్రి తన పార్టనర్స్‌కు చెప్పి పంపినా ఫలితం లేకపోయింది.
ఈ సంగతి సి.ఎం. కిరణ్ కుమార్ రెడ్డి వద్ద పంచాయితీ పెట్టి తేల్చేద్దామని ఆ సీనియర్ మంత్రి పార్టనర్స్‌కు భరోసా ఇచ్చారు. అయితే దీనికి కూడా ఆ పార్టనర్స్ అంగీకరించలేదని తెలిసింది. ఇలా చేస్తే మొదటికే మోసం వచ్చే ప్రమాదం ఉందని వారు భయపడ్డారని తెలిసింది.ఈ దశలో మీరు జోక్యం చేసుకుంటే ఈ జూనియర్ మంత్రికి కోపం వచ్చి ఎదురుతిరిగితే మనం చేసేది ఏమీ ఉండదని , అందుకే ఆ జూనియర్ మంత్రి అడిగిన రూ. 25 కోట్లు ఇచ్చేయాలని వారు సీనియర్ మంత్రికి నచ్చజెప్పినట్లు తెలిసింది. దీంతో రూ.25 కోట్లలో తన వాటా అయిన పది కోట్లను పార్టనర్స్‌కు అప్పగించడానికి ఆ సీనియర్ మంత్రి నిర్ణయించారని తెలిసింది. ఈ కోస్తా ఆంధ్రాలో ఏర్పాటు చేయబోయే ఈ ప్రాజెక్టులో ఆ సీనియర్ మంత్రి కుమారుడు వాటా దారుడిగా ఉన్నారు. ఈ కుమారుడి మీదా, ఆమె తల్లి అయిన సీనియర్ మంత్రి పైనా కూడా ఆరోపణలు ఉన్నాయి.
తన మంత్రి వర్గ సహచరురాలికి ఈ ప్రాజెక్టులో వాటా ఉన్నప్పటికి జూనియర్ మంత్రి ఏ మాత్రం కనికరం చూపకుండా ముడుపులు అందుకోవడానికి సిద్దపడుతున్నట్లు తెలిసింది.మరో అసక్తి కరమైన విషయం ఏమిటంటే ఇటువంటి మరో ప్రాజెక్టును ఆలస్యంగా చేపట్టినప్పటికి దానికి ఇప్పటికే అన్ని అనుమతులు లభించాయి.కాని సీనియర్ మంత్రి పార్టనర్‌గా ఉన్న ఈ ప్రాజెక్టు మాత్రం ముందుకు సాగడం లేదు. అందుకే మిగిలిన పార్టనర్లు మంత్రి పేరు ప్రస్తావించకుండా ప్రాజెక్టులకు అనుమతులు తెచ్చుకోవడానికి నడుంబిగించినట్లు తెలుస్తోంది.