లగడపాటి జెండా కథేమిటి?
posted on Jun 10, 2012 @ 3:44PM
విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ తన ఇంటిపేరు జగడపాటిగా మార్చుకుంటే బాగుంటుందని సూచనలు వస్తున్నాయి. ఈ మధ్య ఆయన పట్టుకు తిరుగుతున్న జెండాపై కథలు కథలుగా ఈసీకి పిర్యాదులు అందుతున్నాయి. తననేమీ చేయలేరన్నధీమాగా లగడపాటి జాతీయజెండాపై సోనియాగాంధీ, మహాత్మాగాంధీ బొమ్మలు చిత్రికరించేలా ఏర్పాటు చేసుకున్నారు. పైగా అదే జెండా మధ్యలో హస్తం గుర్తు కుడా ముద్రించారు. ఇలా జాతీయజెండాను పార్టీ జెండాలా తాయారు చేయించుకు తిరగటం పెద్దనేరం. ఒకరకంగా చెప్పాలంటే జాతీయతా భావనను ఎంపి హోదాలో ఎగతాళి చేయటం లాంటిది. అందుకే పార్టీ జెండాలను, జాతీయ జెండాకు తేడ ఉంచాలని సూచనలున్నాయి. చదవురాని వారికి జాతీయజెండాపై గౌరవము౦టే మరి ఎంపిగా ఉన్న లగడపాటి ఏ జాతీని కించపరిచేలా ప్రవర్తిస్తున్నారో ఒక్కసారి తడిమి చూసుకోవాలి ప్రతిపక్షాలు కోరుతున్నాయి. ఈసి సంగతెలా ఉన్నా కనీసం సగటు భారతీయుడనని అనిపించుకోనేందుకు లగడపాటి ఆ జెండాను ఉపయోగి౦చరాదని పలువురు కోరుతున్నారు. పిల్లలకు బుద్దులు చెప్పాల్సిన వయసులో జాతీయవత్తు గర్వపడే జెండాను కించపరిచేలా లగడపాటి తిరిగితే గట్టి పరాభవం తప్పదని ప్రతిపక్షాలు గట్టిగానే హెచ్చరిస్తున్నాయి.