మీ బడిని అలా వదిలేస్తారా సీఎం సార్!
posted on Jul 13, 2022 @ 4:07PM
చదువుకుని ఉన్నతోద్యోగాల్లో స్థిరపడినవారిలో చాలామంది తమ వూరికి ఏదో చేయాలన్న ఆకాంక్ష బాగా వ్యక్తం చేస్తున్నారు. నిజంగానే చాలామంది వూళ్లలో రోడ్డు వేయించడమూ, చదువుకున్న పాఠశాలకు ఆర్ధిక సాయం చేయడం, వీలయితే భవనాన్ని బావుచేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఇది ఇటీవల బాగా జరుగుతోన్న హర్షించదగ్గ పని. ఈ జాబితాలోకి తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా వచ్చారు. ఆయ న దుబ్బాకలో చదువుకున్న ఉన్నత పాఠశాలను పునర్నించడానికి పూనుకున్నారు. అంతేకాదు 2016 లో ఏకంగా కొత్త భవనాన్నేనిర్మించారు. ఇంతవరకూ హర్షణీయమే. కానీ అక్కడితో చేతులు దులి పేసుకు న్నారు సీఎం. భవనం దిట్టంగా బావుండడంతో ఇంకా ఆరంభోత్సవమూ కాకపోవడంతో దుబ్బాకలో మందుబాబులకు పైసా చెల్లించకుండానే అది సరికొత్త బార్‌గా మారింది!
కేసీఆర్ దుబ్బాక ఉన్నత పాఠశాలలో 1974-78 మధ్య చదువుకొన్నారు. ఆ బడి శిథిలావస్థకు చేరడంతో పునరుద్ధరించాలని నిర్ణయించారు. అధికారులను ఆదేశించారు. 2016లో బడిని కూలగొట్టి కొత్త భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. జూనియర్ కాలేజీని కూడా అదే భవనంలో నిర్వహించాలన్న ఉద్దేశంతో మూడంతస్తుల భవన నిర్మాణం ప్రారంభించారు. 2018లో నిర్మాణం పూర్తైంది. అప్పటి దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి పర్యవేక్షణలో గెలాక్సీ సంస్థ ఈ భవనాన్ని నిర్మించింది.
పది కోట్ల రూపాయలు పెట్టి కట్టిన భవనం పేకాటకు స్థావరమైంది. రాజమహల్‌ను తలపించే రీతిలో రెండేళ్ల క్రితం నిర్మించిన భవనం నిరుపయోగంగా మిగిలిపోయింది. కేసీఆర్ చేతుల మీదుగా కొత్త భవనా న్ని ప్రారంభించాలని దుబ్బాక నేతలు భావించడం.. భవన నిర్మాణం పూర్తై రెండేండ్లైనా బడిని ప్రారం భించకపోవడమే ఈ దుస్థితికి కారణమైంది. సీఎం కేసీఆర్ పాఠశాలను ప్రారంభిస్తారని రామలింగారెడ్డి అప్పట్లో ప్రకటించారు. అయితే, ఆ ప్రకటన చేసిన నెల రోజులకే రామలింగారెడ్డి కరోనా తో 2020 ఆగస్టు లో చనిపోవడంతో పాఠశాల ప్రారంభోత్సవం ఆగిపోయింది.
సీఎం కేసీఆర్ చేతుల మీదుగా పాఠశాల భవనాన్ని ప్రారంభిస్తే నియోజకవర్గానికి ఏమైనా అభివృద్ధి ప్రాజె క్టులు రావొచ్చని స్థానిక నేతలు భావిస్తున్నారు. దీంతో కార్పొరేట్ స్థాయిలో కట్టిన బడి నిరుపయోగంగా మారింది. గుర్తు తెలియని వ్యక్తులు కిటికీలకు ఉన్న అద్దాలను ధ్వంసం చేశారు. బడిలో ఖాళీ మద్యం సీసాలు దర్శనమిస్తున్నాయి. 2016లో బడిని కూల్చివేయడంతో దుబ్బాక పాత జూనియర్ కాలేజీ భవనం లోనే బడిని కూడా నిర్వహిస్తున్నారు. కొత్త భవనం ప్రారంభించకపోవడంతో ఇరుకు గదుల్లోనే విద్యా బోధ న చేస్తున్నారు. ప్రత్యేకంగా ట్రాన్స్‌ఫార్మర్ 18,787 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ భవనాన్ని నిర్మించా రు. బడి కోసం 14 గదులు, జూనియర్ కాలేజీ కోసం 14 గదులు కేటాయించారు. సిబ్బంది, ప్రయోగశాలలు, స్టోర్ రూమ్, ఆడిటోరియం వీటికి అదనం. బడికి, కాలేజీకి వేర్వేరుగా వాటర్ ట్యాంకులు, కరెంటు కోసం ప్రత్యేకంగా ట్రాన్స్ ఫార్మర్‌ను ఏర్పాటు చేశారు. 250 మంది ఒకేసారి వినియోగించుకొనేలా మరుగుదొడ్లు నిర్మించారు. అన్నీ బాగానే వున్నాయి. కానీ తాను చదువుకున్న బడిని అలా పేకాటరాయుళ్లకి వదిలే యడం ఎంతవరకూ సబబు అని దుబ్బాక ప్రజలు విచారం వ్యక్తం చేస్తున్నారు.