కెసిఆర్ రెండంచల రాజకీయ పోరాటం
posted on Aug 17, 2012 8:31AM
టిఆర్‌యస్ నేత కెసీఆర్ ఒకవైపు పార్టీని పటిష్టపర్చడానికి, మరోవైపు తెలంగాణ ఉద్యమాన్ని బలంగా ముందుకు తీసుకువెళ్ళడానికి వ్యూహాలు రచిస్తున్నట్లు తెలిసింది. 2014 ఎన్నికల్లో టిఆర్‌ఎస్ పార్టీ ఎక్కువ సీట్లు తెచ్చుకునే లక్ష్యంతో ఆయన ఇప్పటినుంచే కసరత్తు చేయక తప్పటం లేదు. ఆగస్టు 20 తర్వాత తెలంగాణా ఉద్యమాన్ని ఉదృతి చేస్తామని ఇప్పటికే ప్రకటించారు. దీనికై ఈనెల24 నుండి 26 వరకు తెలంగాణభవన్‌లో సమావేశాలను నిర్వహిస్తున్నారు. అంతకు ముందు 42 రోజులపాటు ఉద్యోగ , ఉపాద్యాయ విద్యార్ధి, కార్మిక వర్గాలతో జరిపిన సకలజనుల సమ్మె తెలిసిందే.
అయితే ఉద్యోగులు తమ బాధ్యతలు నిర్వహిస్తూ ప్రభుత్వానికి వణుకు పుట్టిస్తారని ఇటీవల పదవీవిరమణ చేసిన టిఎన్‌జివో పూర్వాదక్షుడు స్వామిగౌడ్ చెప్పటంతో రాజకీయవర్గాల్లో ఆసక్తి రేగింది. జీతాలకు ఢోకా లేకుండా ఉద్యమంలో ఎలా కొనసాగుతారో అని అన్ని ప్రధానపార్టీలు, ప్రభుత్వం ఉత్కంఠతో ఉన్నాయి. వచ్చే నెలలో అసెంబ్లీ సమావేశాలు కూడా మొదలవ్వబోతుండటంతో ఈవిషయం ప్రభుత్వానికి మింగుడు పడటం లేదు. అసెంబ్లీలో తెలంగాణకు సంబంధించి అన్నిఅంశాలను లేవదీయనున్నారు. దానిలో మెడికల్ సీట్లు, గ్యాస్ ఆధారిత ప్లాంట్లయిన నేదునూరు, శంకరంపల్లి ప్రాజెక్టులకు గ్యాస్ కెటాయించకపోతుండటం కూడా లేవనెత్తనున్నారు. తెలంగాణ రాజకీయ జెఎసిచైర్మన్ కోదండరామిరెడ్డి వ్యవహారశైలిపై కూడా దుమ్మెత్తి పోయనున్నారని తెలుస్తుంది. భారతీయ జనతా పార్టీతో అది చెట్టాపట్టాల్ వేసుకుని తిరగడమే కారణంగా చెప్పవచ్చు. ఇప్పటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ తెలంగాణాకు యస్ చెబితే తన కూటమిలోకి చేర్చుకోవాలా వద్దా అని కూడా ఆలోచిస్తున్నారు.