కమలమ్మ కాంగ్రెస్ సభ్యురాలే : డీఎల్
posted on Apr 12, 2011 @ 3:15PM
కడప: కమలమ్మ కాంగ్రెస్ సభ్యురాలేనని డిఎల్ రవీంద్రారెడ్డి, వీరశివారెడ్డిలు పేర్కొన్నారు. బుధవారం నుంచి కాంగ్రెస్‌పార్టీకి కమలమ్మ ప్రచారం చేస్తారని అన్నారు. మంత్రి పదవికి రాజీనామా చేయకుండానే కడప లోక్‌సభ స్థానానికి పోటీచేస్తున్నట్లు తెలిపారు. మరికొంతమంది జగన్ వర్గం శాసనసభ్యులు తమవైపు వస్తారని డీఎల్ ఆశాభావం వ్యక్తం చేశారు. కమలమ్మ కాంగ్రెస్‌లో చేరితే జగన్‌కు కొంతవరకు నష్టం జరిగే అవకాశం ఉంది. జగన్‌ను మొదటి నుంచి గట్టిగా సమర్థిస్తూ వస్తున్న బద్వేలు శాసనసభ్యురాలు కమలమ్మ కాంగ్రెసు గూటికి చేరారు. జగన్ వర్గానికి చెందిన తోటి ఎమ్మెల్యే ఒకరితో కమలమ్మకు విభేదాలు తలెత్తినట్లు కొద్ది రోజుల క్రితం జరిగింది. దాంతో ఆమె తీవ్ర అసంతృప్తికి గురై తన మాతృ సంస్థ కాంగ్రెసు వైపు తిరిగి రావడానికి సిద్ధపడినట్లు కూడా వార్తలు వచ్చాయి. ఆమె బుజ్జగించడానికి వైయస్ జగన్ వర్గం తీవ్రంగా ప్రయత్నాలు చేసింది. అయితే ఆ ప్రయత్నాలు ఫలించినట్లు లేవు.కమలమ్మ కడప జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) కార్యాలయానికి వచ్చి మంత్రి అహ్మదుల్లా, డిఎల్ రవీంద్రారెడ్డితో సమావేశమయ్యారు. ఇదే బాటలో రైల్వేకోడూరు ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు కూడా నడవనున్నారని సమాచారం. కొరముట్లను కూడా తిరిగి కాంగ్రెస్‌లో కొనసాగేలా పార్టీ ప్రముఖులు చేస్తున్న ప్రయత్నాలు ఫలించనున్నాయని తెలుస్తోంది.