జైల్లో ఉల్లాసంగా ఉత్సాహంగా జగన్
posted on Jun 23, 2012 @ 5:49PM
వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ అధినేత జగన్ చంచల్ గూడా జైల్లో ఉల్లాసంగా ఉత్సాహంగా గడుపుతున్నట్లు ఆయన సన్నిహితులు తెలుపుతున్నారు. జైల్లో దాదాపు నెల రోజులుగా వుంటున్న జగన్ ఆరోగ్యం కోసం వెజిటబుల్ జ్యూస్‌ల మీదే ఎక్కువగా ఆధానపడుతున్నట్లు తెలుస్తుంది. ఉదయం రెండుగంటలపాటు బైబిల్ చదవటం, పేపర్లు తిరగవేయడం చేస్తున్న జగన్ ప్రత్యేక సదుపాయాలు కలిగి రోజూ నాన్‌వెజ్ తినే అవకాశం ఉన్నప్పటికి ఆయన పూర్తిగా శాఖాహారమే తింటున్నట్లు తెలుస్తోంది. అదే ఓల్డు హాస్పిటల్ బ్లాకులో ఉన్న మిగతా విఐపి లంతా కేవలం ఆదివారం మాత్రమే మాంసాహారం తింటున్నారని తెలిసింది. అప్పుడప్పుడు అదే బ్లాకులో ఉన్న 10 మంది విఐపి ఖైదీలతో జగన్ మాట్లాడుతున్నా ఎక్కువ సమయం ఏకాంతం లోనే వుంటునారు. మోపిదేవిరమణ కు జగన్ కు జాలీ ములాఖత్ ఉన్నందువలన మాట్లాడుకునే అవకాశం వున్నప్పటికి అంతగా ఆనాయకులు మాట్లాడుకోవడం లేదని తెలుస్తోంది. వారానికి మూడు ములాఖత్‌లు మాత్రమే వున్నందున విజయమ్మ, జగన్ భార్య బారతి కొత్తగా ఎన్నికైన ఎంఎల్యేలు ఆ అవకాశాన్ని ఉపయోగించుకోవడం వల్ల మిగిలిన నాయకులకు జగన్ ను కలుసుకునే అవకాశం లభించడం లేదు.