జగన్ ఆస్తుల కేసు:రెండో దపా సిబిఐ కస్టడి పూర్తి
posted on Jun 10, 2012 @ 6:22PM
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి రెండో విడత సిబిఐ కస్టడి నేటితో పూర్తయింది. ఉదయం పదిన్నర గంటల ప్రాంతంలో సిబిఐ అధికారులు జగన్ ను బుల్లెట్ ప్రూఫ్ వాహనంలో తీసుకు వెళ్లారు. జగన్ ను దాదాపు ఆరు గంటల పాటు సిబిఐ విచారించింది. ఈ విచారణలో ప్రధానంగా విదేశీ ఆర్థిక లావాదేవీలపై ఆరా తీసిన్నట్టు తెలుస్తోంది. అలాగే, జగన్ విదేశాల్లో పెట్టిన పెట్టుబడులు, ఆయన కంపెనీల్లో విదేశీ సంస్థలు పెట్టిన పెట్టుబడులపై సీబీఐ అధికారులు విచారించిన్నట్టు సమాచారం. కాగా ఇంతకు ముందు ఐదు రోజుల పాటు సిబిఐ అధికారులు వైయస్ జగన్‌ను ప్రశ్నించారు. మరో రెండు రోజులు తమ కస్టడీకి కావాలని సిబిఐ కోర్టును కోరడంతో కోర్టు అనుమతించింది. దీంతో శనివారం ఆయనను ప్రశ్నించారు. ఆదివారం కస్టడీకి తీసుకున్నారు. వైయస్ జగన్‌ను సిబిఐ 27వ తేదీ సాయంత్రం అరెస్టు చేసి, 28వ తేదీన చంచల్‌గుడా జైలుకు తరలించింది. ఆ తర్వాత జగన్‌ను భారతి మే 29, 30, 31 తేదీల్లో జైలులో ములాఖత్‌లో కలిసారు. ఆ మరునాడు జూన్ 1న ఆమె జగన్‌ను కలవడానికి రాగా నిబంధనల ప్రకారం కుదరదని జైలు అధికారులు తిరస్కరించారు.