జగన్‌ను ఎదుర్కొనడానికి చిరంజీవిని రంగంలోకి
posted on Apr 18, 2011 @ 11:21AM
హైదరాబాద్: కడప ఉపఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి ప్రచారం తేది దాదాపుగా ఖరారు అయినట్లుగా కనిపిస్తోంది. కడప పార్లమెంటు, పులివెందుల శాసనసభ ఎన్నికల్లో ధీటైన అభ్యర్థి అయిన జగన్‌ను ఎదుర్కొనేందుకు చిరంజీవిని రంగంలోకి దించాలని కాంగ్రెసు అధిష్టానం యోచిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే చిరంజీవి తమిళనాడు, పుదుచ్చేరి, కర్ణాటక ఎన్నికలలో ప్రచారం చేసి వచ్చారు. ఇప్పుడు కడప ఉప ఎన్నికలలో చిరంజీవిచే ప్రచారం చేయించి కాంగ్రెసును మరింత ప్రభావవంతంగా చేయాలని యోచిస్తోంది. ఈ నెల 28వ తేది నుండి 30 తేది వరకు చిరంజీవి కడప జిల్లాలో పర్యటిస్తారు. అయితే చిరంజీవి ప్రభావం కాంగ్రెసుకు ఏ మేర ఉపయోగపడుతుందో ఎన్నికల తర్వాతే తెలుస్తుంది. ఇక చిరు పర్యటన తర్వాత ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు డి శ్రీనివాస్, ఆంధ్ర ప్రదేశ్ వ్యవహారాల ఇంఛార్జ్ గులాం నబీ ఆజాద్ కూడా పర్యటించనున్నారు. మొత్తానికి జగన్‌ను ఎదుర్కొనడానికి కాంగ్రెసు పార్టీ అష్టకష్టాలు పడుతోంది.