ఇందిరమ్మ బా(ఆ)టలవసరమా?
posted on Aug 9, 2012 @ 11:15AM
ఇంజనీరింగ్ కళాశాల యాజమాన్యాల ధన దాహం, రాష్ట్ర ప్రభుత్వ పిసినారి తనంతో ఇంటర్ విద్యార్దులు నలిగి పోతున్నారు.ఫీజుల రీఎంబర్స్‌మెంట్ పాక్షింకంగా మాత్రమే చెల్లిస్తామన రాష్ట్ర ఫ్రభుత్వం అంటోంది. పాత ఫీజలు మాత్రమే చెల్లిస్తామని కొత్తగా పెరిగిన ఫీజలను విద్యార్ధులే భరించాలనటంతో విద్య మద్యతరగతి, దిగువ మద్యతరగతి వారికి ఇంజనీరింగ్ విద్య అందని ద్రాక్ష గా మారింది. ఇకపై విద్యార్ధులు చదుకోవడం మాని చదువుకొనటంపై దృష్టి సారించవలసి వస్తుంది.
అన్ని రాష్ట్రాల్లో అడ్మిషన్లు ముగిసి క్లాసులు జరుగుతున్నా ఇంతవరకు మన రాష్ట్రంలో మాత్రం ఎంసెట్ కౌన్సిలింగ్ కాదుకదా కౌన్సిలింగ్ డేట్‌కూడా ప్రకటించలేదు. ముఖ్యమంత్రి ఇందిరమ్మ బా(ఆ)ట లో సాగుతున్నారు. ఇప్పటికే తూర్పుగోదావరి, శ్రీకాకుళం జిల్లాల పర్యటన ఆటపాటలతో సాగగా ప్రస్తుతం ఖమ్మం జిల్లాలో కట్టుదిట్టమైన భద్రతా చర్యలమద్య ఇందిరబాట పర్యటనను కొనసాగిస్తున్నారు. రాష్ట్ర సమస్యలను, విద్యార్ధుల అడ్మిషన్లను గాలికి ఒదిలి వేయటం రాష్ట్ర ప్రజలకు ఆగ్రహాన్ని కలిగిస్తుంది. మన రాష్ట్రంనుండి మహారాష్ట్రలోని రత్నగిరి ఫెర్టిలైజింగ్‌కి గ్యాసు తరలించడం వల్ల ముఖ్యమంత్రి పై నిన్నటి వరకు ప్రతిపక్షాల, ప్రజల విమర్శలతోపాటు ముఖ్యమత్రి పదవికి కూడా ముప్పు వాటిల్లింది. సరైన సమయంలో ప్రధాన మంత్రిజోక్యంచేసుకొని గ్యాస్ మనరాష్ట్రంకి కేటాయించటంతో సమస్య సద్దుమణిగింది. ఇలాంటి పరిస్థితుల మద్యముఖ్యమంత్రి ఖమ్మం జిల్లా పర్యటన విమర్శల పాలవుతూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఉదాసీన వైఖరి కొనసాగిచడం రాజకీయ విశ్లేషకులకు, ప్రజలకు మింగుడు పడటం లేదు. సుస్ధిరమైన మెజారిటీ ఇచ్చినా బాధ్యతా యుతమైన పరిపాలన అందించలేకపోవడం రాష్ట్ర ప్రజలకు శాపంగా పరిణమించిందని చెప్పక తప్పదు. కేంద్రం కోరిక మేరకు పరిపాలన కాకుండా ప్రజలభీష్టం మేరకు పరిపాలన సాగించాలని రాజకీయ మేధావులు కోరుతున్నారు.