దేశం దివాళా తీస్తోందా?
posted on Jun 29, 2012 @ 3:10PM
నిజమే భారతదేశం దివాళాతీయనుంది. ఇది ఎవరో చెప్పింది కాదు. సాక్షాత్తు ఆర్ధినిపుణులు దేశం ఎదుర్కొవలసిన గడ్డు పరిస్థితిని వివరిస్తూ చేసిన ప్రకటన. మన దేశంలోని ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయలేకపోతే ఏర్పడే పరిస్థితుల గురించి చెబుతున్న మాట. కాలంచెల్లిన ఆర్ధికవిధానలతో ఏర్పడే పతనావస్థ. రెండు దశాబ్ధాలతో పోలిస్తే ఈ ఏడాది మరీ ఘోరంగా వుంది. పైపైన డాంబికాలు పలికినా ప్రభుత్వం నానా కష్టాలు పడుతుంది. జనవరి -మార్చి మద్య ఎకనామిక్ గ్రోత్ 8.4 శాతం ఉంటే ఏప్రిల్ -జూన్ మద్యకాలంలో 7.7 శాతానికి దిగిపోయింది. ఇందుకు ఎన్నోకారణాలు చూపుతుంది మన ప్రభుత్వం. దానిలో కొన్ని వడ్డీరేట్లు ఎక్కువచేయడం, డాలర్‌తోచూస్తే రూపాయివిలువ పడిపోవడం, ఇన్వెస్టిమెంట్లు ,ఎగుమతులు మందగించడం చెప్పుకుపోతే చాలానే ఉన్నాయి. ద్రవ్యలోటే మన కొంపముంచుతుంది. దీనికి కారణం ప్రణబ్ దాదా అనే చెప్పక తప్పదు. రెండకెల స్దాయిలో కదలాడిన ద్రవ్యోల్బణం రిజర్వ్‌బ్యాంకుకు సమస్యలు తెచ్చిపెట్టింది. లిక్వడిటీ, ద్రవ్యోల్బణం అదుపు తప్పకుండా చూడటం రిజర్యుబ్యాంకు బాధ్యత.
ప్రస్తుత పరిస్థితుల్లో ధరలను కట్టడిచేస్తూ వృద్దికి చర్యలు తీసుకోవడం ఆర్‌బిఐకు తలకు మించిన భారంగా తయారయ్యింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి ఏకంగా 57.92 స్థాయి తాకింది. ఏడాది వ్యవధిలో రూపాయి ఇప్పటివరకూ 21 శాతం క్షీణించింది. దీనివల్ల దిగుమతుల బిల్లు పెరిగింది. ఇప్పటికీ కళ్లు తెరవకపోతే దారుణపరిణామాలను ఎదుర్కొవలసిందేనని ఆర్ధికనిపుణుల హెచ్చరిక. వరుణదేవుడి కరుణలేక రైతులూ, ఉద్యోగాలులేక యువత, జీతాలకీ ఖర్చులకీ సయోధ్యకుదరక సామాన్యులు బ్రతుకు భారంగా వెళ్లదీస్తున్నారు. ఇప్పటికే అమెరికా, యూరప్ దేశాల ముందుచూపులేని ప్రణాళికల వల్ల ఆర్ధికవ్యవస్త కుప్పకూలింది. లండన్‌లో మరోమూడేళ్లకి సగటు కుటుంబ ఆదాయం ఏడాదికి ఏడువేల పౌండ్లకన్నా తక్కువగా పడిపోతుందని హౌస్ ఆఫ్ కామర్స్ అక్కడి ఆర్ధిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఏదిఏమైనా మన రూపాయిని స్ధిరంగానిలబెట్టే చర్యలు ఆర్ధికమంత్రిగా కూడా ఉన్న మన్‌మోహన్‌సింగ్ తీసుకుంటారని ఆశిద్దాం. 20 ఏళ్లక్రితం దేశంలో ఉన్న ఆర్ధిక సమస్యలే దాదాపుగా ఇప్పుడు ఉన్నాయి. అప్పటిలా అంతర్జాతీయంగా బంగారం తాకట్టు పెట్టేంత పరిస్థితి లేకపోయినా పరిస్థితులు తీవ్రంగానే ఉన్నాయనేది జగమెరిగిన సత్యం. మన్మోహన్ మరోసారి తన సత్తాచాటి దేశాన్ని ఆర్ధికస్వావలాంబన దిశగా నడిపిస్తారని ఆశిద్దాం.