కరెంటుకష్టాలకు చెక్ పెట్టేదెప్పుడు
posted on Aug 3, 2012 @ 12:20PM
ఈరోజు గడిస్తే చాలు అన్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వ ధోరణి ఉంది. ఒక భాద్యతాయుతమైన పరిపాలన అందించాలన్న అవగాహన లేకుండా ప్రవర్తించడం వల్లే నేటి కరెంటు సమస్య ఉత్పన్న మైంది. ఇదే పరిస్థితి కొన సాగితే రానున్న రోజుల్లో రాష్ట్రం అంధకారం లోకి వెళుతుందనటంలో ఎటువంటి సందేహం లేదు. దశాబ్దాలుగా ప్రభుత్వ రంగంలోని పొరపాట్లు, ముందు జాగ్రత్త లేకపోవడం వల్లే ఇలాంటి వైఫల్యాలను ఎదుర్కొవలసి వస్తుంది. దేశంలో 300 ఏళ్లకు సరిపడా బొగ్గు నిల్వలు ఉన్నా రాష్ట్రంలో అంధకారం అలుముకుంటోంది.వృధాను అరికట్టి , పంపిణీ వ్యవస్తను మెరుగుపరచవలసిన అవసరం ఎంతైనా ఉంది. ప్రస్తుతం ఉన్న ధర్మల్ విద్యుత్ ప్లాంట్లన్నీ బూడిదతో నిండి పోయాయి.చుట్టుప్రక్కల ప్రాంతాలన్నీ కాలుష్య మయం అయ్యాయి. దీనివల్ల చుట్టుప్రక్కల నివాసముండే ప్రజలంతా అనారోగ్యం పాలయ్యారు.అందుకే పరిశ్రమలన్నా, విద్యుత్ ప్లాంట్లన్నా ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. మొదటినుండి శుద్దికార్యక్రమాలున్నట్లయితే ఇప్పుడు ఈ పరిస్థితివచ్చి వుండేది కాదు. ఇదే పరిస్థితి కొన సాగితే రానున్న రోజుల్లో వెంట ఆక్సిజన్ సిలిండర్ తో ప్రజలు ప్రయాణించ వలసి వస్తుంది.