గోరంట్ల మాధవ్ బరితెగించాడు!
posted on Aug 4, 2022 @ 10:32PM
చట్టానికి, న్యాయానికి, ధర్మానికీ కనిపించే ఆ మూడు సింహాలు ప్రతీకలైతే... కనిపించని ఆ నాలుగో సింహమే రా పో.. లీస్ అంటూ డైలాగ్ కింగ్ సాయి కుమార్ చెప్పిన నాటి డైలాగ్.. నేటికి ఆ శాఖలోని తుపాకీలో నుంచి దూసుకు వచ్చిన తూటాలాగా అక్కడో... ఇక్కడో... ఎక్కడో.. పేలుతూనే ఉంటోంది. అయితే అలాంటి శాఖలో కీలక ఉద్యోగానికి రాజీనామా చేసి.. ప్రజా సేవ కోసం అంటూ వైసీపీలో చేరారు గోరంట్ల మాధవ్. ఆ తరువాత ఉమ్మడి అనంతపురం జిల్లాలోని హిందూపురం నుంచి లోక్ సభ అభ్యర్థిగా పోటీ చేసి.. గెలుపొందారు.
అయితే హిందూపురం అంటేనే తెలుగుదేశం పార్టీ కంచుకోట. ఇక్కడ నుంచి టీడీపీ అభ్యర్థిగా కుక్కను నిలబెట్టినా గెలుస్తుందనే ఓ టాక్ ఎప్పటి నుంచో ఉంది. అలాంటి చోట ఈ ఖాకీ మాజీ అధికారి గెలుపొందడంతో, వైసీపీ శ్రేణులు అప్పట్లో ఓ రేంజ్‌లో పండగ చేసుకున్నాయట. ఎంపీగా గెలుపొందిన తర్వాత.. గోరంట్ల మాధవ్ ప్రతిపక్ష పార్టీ టీడీపీ నేతలపై ఓ స్థాయిలో రెచ్చిపోయారని అంటున్నారు. అయితే నాని బ్రదర్స్ మాత్రం కాదని వైసీపీ వారే ఒకింత ఫీల్ అయ్యారని కూడా అంటుంటారు.
అయితే తాజాగా ఎంపీ గోరంట్ల మాధవ్ రాస లీలలు అంటూ అటు మీడియాలో ఇటు సోషల్ మీడియాలో వీడియో ఒకటి వైరల్ అయ్యింది. దీంతో గోరంట్ల మాధవ్ ఎంపీగా ఎన్నిక కావడానికి ఖాకీ యూనిఫారమ్.. పక్కన పెట్టాశాడు.. ఎంపీగా ఎన్నికైన తర్వాత దుస్తులే పక్కన పెట్టేశాడనే వైసీపీ శ్రేణులే జోకులు వేసుకుంటున్నాయి.
అక్కడితో ఆగితే ఓకే.. కానీ వైసీపీలో చాలా మటకు ఇలాంటి వారే ఉన్నారేంటి అంటూ అ ఓ నెటిజన్ సోషల్ మీడియా సాక్షిగా ప్రశ్నించడం పట్ల.. తోటి నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారట. పోలీస్ శాఖలో ఉన్నప్పుడు కూడా గోరంట్ల మాధవ్‌కు మంచి ట్రాక్ రికార్డే ఉందట. ఆయనపై రేప్ కేసు కూడా ఉందని చెబుతున్నారు. అన్నిటికీ గోరంట్ల మాధవ్ కు సినిమా పిచ్చి కూడా ఒకింత ఎక్కువేనంటున్నారు.
శివమణి.. 9848022338 (మెంటల్), సీతయ్య (ఎవరి మాట వినడు) గబ్బర్ సింగ్.. వీడి తిక్కకు లెక్క ఉంటుంది స్టైల్‌లో పోలీసులకు సంబంధించి ఏ సినిమా విడుదల అయితే ఆ సినిమా ప్రభావం.. నాటి ఈ సీఐ గారి మీద స్పెషల్ ఎఫెక్ట్‌తో కనిపించేదని సీమ పోలీసులు ఇప్పటికీ చెప్పుకుంటుంటారు. అయితే తాజాగా ఈ మాజీ సీఐ ప్రస్తుత ఎంపీ బర్త్ డే సూట్ తాలుకు వీడియో.. మీడియాలోనే కాకుండా సోషల్ మీడియాలో సైతం చల్ చల్ గుర్రం చలాకీ గుర్రం అన్నట్లు హల్‌చల్ చేస్తుండడంతో గోరంట్ల మాధవ్ వై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
మరోవైపు గోరంట్ల మాధవ్... సీఐగా పని చేస్తునే.. అనంతపురం జిల్లా పోలీసు అధికారుల సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శిగా పని చేశారు. ఆ క్రమంలో నాటి అనంతపురం లోక్‌సభ సభ్యుడు జేసీ దివాకర్ రెడ్డి... పోలీసులను ఉద్దేశించి అసభ్య పదజాలంతో దూషించి.. తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీంతో ఎంపీ వ్యాఖ్యలపై నాటి సీఐ గోరంట్ల మాధవ్.. నిప్పులు చెరిగి.. విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి.. విధి నిర్వహణలో ఉన్న పోలీసులను దుర్బాషలాడితే.. నాలుక చీరేస్తానంటూ మీసం మేలేసి మరీ వార్నింగ్ ఇచ్చారు.
దీంతో ఒక్కసారిగా గోరంట్ల మాధవ్ టాక్ ఆఫ్‌ది స్టేట్ అయిపోయాడు. ఆ తర్వాత ఆయన జగన్ పార్టీ కండువా కప్పుకొవడానికి మార్గం సుగమం అయింది. ఇలా ఆనాటి నుంచి చెలరేగిపోతోన్న గోరంట్ల మాధవ్ వీడియో నేపథ్యంలో మీడియా ముందుకు వచ్చి.. మాట్లాడిన మాటలు వింటుంటే ఆయన బరితెగించాడని అర్ధమౌతోందని పరిశీలకులు అంటున్నారు.